వంటగదిలో ఆడవారికి పని త్వరగా అవ్వాలంటే కొన్ని కిటుకులు పాటించాల్సిందే. లేకపోతే కిచెన్ లో పనులు అంత సులభంగా అవ్వవు. ముఖ్యంగా సీజన్ల బట్టి ఆయా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వంటలు టేస్టీగా రావాలన్నా కూడా చిట్కాలు పాటించాల్సిందే.
మీకోసం మరిన్ని చిట్కాలు:
-వంటగదిలో బంగాళా దుంపలు, ఉల్లిపాయలు ఒకే దగ్గర స్టోర్ చేస్తే అవి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిని ఒకే దగ్గర స్టోర్ చేస్తే వాయువులను రిలీజ్ చేస్తాయి. దీనివల్ల త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఉండాలంటే విడివిడిగా స్టోర్ చేయాలి.
-వర్షాకాలం, వింటర్ సీజన్ లలో మసాలా పదార్థాల్లో తేమ వస్తుంటుంది. దీంతో అచ్చులు ఏర్పడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మసాలా డబ్బాల్లో కాస్త రాళ్ల ఉప్పు వేయాలి. ఇలా చేస్తే సోడియం క్లోరైడ్ తేమని గ్రహిస్తుంది. దీని వల్ల మసాలా పదార్థాలు తడవకుండా ఉంటాయి.
-పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి డబ్బాల్లో కానీ సీసాల్లో కానీ నిలవ చేస్తే ఎరుపు రంగు మారకుండా ఉంటాయి.
-ఉప్పు జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేస్తే.. వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది.
-పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే.. పెరుగులో కొబ్బరి ముక్కను వేసి చూడండి.
-వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటిని ఎండలో కొద్దిసేపు ఉంచండి.
-దోసెల పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే, దోసెలు చిరగకుండా పల్చగా వస్తాయి.
-కోడిగుడ్లు ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గుడ్లను చన్నీళ్లలో వేసినా పెంకు సులభంగా వస్తుంది.
-అలాగే నిమ్మరసం ఎక్కువగా రావాలంటే ముందుగా 20 సెకన్ల పాటు మైక్రోవేవ్ లో ఉంచండి. ఇది నిమ్మకాయని మృదువుగా చేస్తుంది. దీంతో రసం బాగా వస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి