Health Tips: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..

|

Aug 14, 2022 | 11:52 AM

కొంతమంది ప్రధానమైన విటమిన్లు, పలు పోషకాల లోపంతో పలు సమస్యల బారిన పడుతుంటారు. అయితే.. శరీరంలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు లేదా రాబోతున్నప్పుడు శరీరం మనకు దాని సంకేతాలను ఇస్తుంది.

Health Tips: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
Health Tips
Follow us on

Vitamin A Deficiency: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీఒక్కరూ ఏవేవో ఆహార పదర్థాలను తీసుకుంటుంటారు. అయినప్పటికీ.. కొంతమంది ప్రధానమైన విటమిన్లు, పలు పోషకాల లోపంతో పలు సమస్యల బారిన పడుతుంటారు. అయితే.. శరీరంలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు లేదా రాబోతున్నప్పుడు శరీరం మనకు దాని సంకేతాలను ఇస్తుంది. కానీ.. వాటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. కావున శరీరంలో విటమిన్ ఎ లోపం ఉంటే మీ ముఖంపై మొటిమలు, మచ్చలు, మీ చర్మం పొడిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా కంటి చూపు తగ్గుతుంది.. పని చేసేటప్పుడు త్వరగా అలసట ప్రారంభమవుతుంది. దీని ప్రభావం మీ జుట్టు మరియు గోళ్లపై కూడా కనిపిస్తుంది.

విటమిన్ ‘ఎ’ లోపం వల్ల వచ్చే వ్యాధులు..

శరీరంలో విటమిన్ ఎ లేకపోవడం కళ్లపై చాలా ప్రభావం చూపుతుంది. ఇందులో రేచీకటి, కంటిలోని తెల్లటి భాగంలో మచ్చలు, కార్నియా ఎండిపోవడం ప్రారంభమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. దీనితో పాటు విటమిన్ ఎ లోపం వల్ల చర్మం పొడిబారడం, గొంతు ఇన్ఫెక్షన్, ఎముకలు బలహీనపడడం, మహిళల్లో గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి

విటమిన్ ‘A’ లోపాన్ని అధిగమించేందుకు ఇలా చేయండి..

  • శరీరంలో విటమిన్ ఎ లోపాన్ని దూరం చేయడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
  • విటమిన్ ఎ లోపం ఉన్నట్లయితే, ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే వాటిలో విటమిన్ ‘ఎ’ పుష్కలంగా లభిస్తుంది.
  • గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలు, చేపలు లాంటి వాటిని తీసుకోవాలి.
  • విటమిన్ ఎ కూడా పాలలో పుష్కలంగా లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఒక గ్లాసు తాగడం మంచిది. పెరుగు కూడా తీసుకోవాలి.
  • తాజా కూరగాయలను కూడా తినవచ్చు. క్యారెట్లు, దుంపలు, బొప్పాయిలు, పెరుగు, సోయాబీన్స్ లాంటి వాటిని తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..