Tamarind: చింతపండు యమడేంజర్ గురూ..! అలాంటి సమస్యలున్న వారు తింటే రోగాలకు స్వాగతం పలికినట్లే..

|

Jan 22, 2023 | 12:03 PM

భారతీయ వంటకాల్లో చింతపండును బాగా ఉపయోగిస్తారు. చట్నీ నుంచి పులుసు వరకు.. చింతపండు లేనిదే రుచిగా అనిపించదు. చింతపండును..

Tamarind: చింతపండు యమడేంజర్ గురూ..! అలాంటి సమస్యలున్న వారు తింటే రోగాలకు స్వాగతం పలికినట్లే..
Tamarind
Follow us on

భారతీయ వంటకాల్లో చింతపండును బాగా ఉపయోగిస్తారు. చట్నీ నుంచి పులుసు వరకు.. చింతపండు లేనిదే రుచిగా అనిపించదు. చింతపండును ఉపయోగించడం వల్ల వంటలు మరింత రుచికరంగా మారుతాయి. పుల్లగా ఉండే చింతపండు ఖచ్చితంగా పానీ -పూరీ, పులుసు, చట్నీ, తదితర కూరలలో బాగా ఉపయోగిస్తారు. చింతపండు రుచికి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కానీ, కొన్ని అనారోగ్య సమస్యలలో దీనిని తినడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. నిత్యం 10 గ్రాముల చింతపండు మాత్రమే తీసుకోవాలని.. ఎక్కువగా తీసుకుంటే డేంజర్ అని అభిప్రాయపడుతున్నారు. చింతపండు ఏయే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. చర్మ వ్యాధులు: చర్మ సమస్యలలో చింతపండు తీసుకోవడం వల్ల.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు చింతపండుకు దూరంగా ఉండాలని ఆయుర్వేదంలో కూడా వివరించారు. చర్మ సమస్యలలో దీనిని ఉపయోగించడం వల్ల వాపు, దురద, దద్దుర్లు, చర్మం రంగుమారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
  2. మధుమేహం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహంతో బాధపడేవారు చింతపండును తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. చింతపండు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. మితంగా తింటే ఏం కాదని.. కానీ చింతపండు అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొంటున్నారు.
  3. గొంతు మంట: చింతపండు వల్ల గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. గొంతు నొప్పి లేదా ఇతర ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చింతపండుకు దూరంగా ఉండాలి. చింతపండు తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంది.
  4. దంత సమస్యలు: పళ్లకు సంబంధించిన సమస్య పెరగడానికి చింతపండు తినడం కూడా ఓ కారణం కావచ్చు. పుల్లనివి ఎక్కువగా తినడం వల్ల దంతాలలో జలదరింపు, నొప్పి వస్తుంది. ఇది దంతాల ఎనామిల్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఆపరేషన్ సమయంలో తినవద్దు: శస్త్రచికిత్స జరగబోతున్నా.. ఇప్పటికే జరిగినా.. చింతపండు తినడం దాదాపు రెండు వారాల ముందుగానే మానేయాలి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గి ఆరోగ్యం దెబ్బతింటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..