Sleeping Pill: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా..? అయితే మీరు పెను ప్రమాదంలో పడుతున్నట్లే..

|

Sep 28, 2022 | 7:20 AM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు. దీంతోపాటు అనారోగ్యకరమైన జీవినశైలి కారణంగా నిద్రలేమి సమస్య పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Sleeping Pill: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా..? అయితే మీరు పెను ప్రమాదంలో పడుతున్నట్లే..
Sleeping Pill
Follow us on

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు. దీంతోపాటు అనారోగ్యకరమైన జీవినశైలి కారణంగా నిద్రలేమి సమస్య పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఏదైనా టెన్షన్ లేదా స్ట్రెస్ కారణంగా నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే. స్లీపింగ్ మెడిసిన్ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీనితో పాటు, నిద్ర మాత్రల వినియోగాన్ని ఎలా నివారించవచ్చు..? నిద్రమాత్రలు లేకుండా హాయిగా ఎలా నిద్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

అలవాటు పడిన స్లీపింగ్ పిల్ మెదడును క్రమంగా ప్రభావితం చేస్తుంది. ఈ విషయం ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ యాంటీ కోలినెర్జిక్ మాత్రలు, నిద్ర మాత్రలు మీ జ్ఞాపకశక్తిని క్రమంగా బలహీనపరుస్తాయి. ఒక వ్యక్తికి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఈ మందులు వాటంతట అవే ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు కూడా ఇలాంటి మాత్రలు వాడితే.. ఒక నెలలోనే దాని ప్రభావం కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నిద్ర మాత్రలు ప్రమాదకరం..

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా స్లీపింగ్ మెడిసిన్ వాడేవారి మరణాల రేటు పెరిగింది. కానీ స్లీపింగ్ మెడిసిన్ తీసుకోని వారి సంఖ్య తక్కువగా ఉంది. నిద్రమాత్రలు వాడటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర మాత్రలు తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. దీని రెగ్యులర్ వినియోగంతో మలబద్ధకం, బలహీనమైన జ్ఞాపకశక్తి, కడుపు నొప్పి, బలహీనత, మైకము వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, మీరు నిద్రపోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించడం మంచిది.

  • ప్లాన్ చేసుకోండి: నిద్రపోయే సమయాన్ని నిర్ణయించండి.. (నిద్రపోయే సమయం – మేల్కొనే సమయం) రెండింటినీ నిర్ణయంతో మీ రొటీన్ లైఫ్ మొత్తం కరెక్ట్ అవుతుంది. మీరు ఫ్రెష్ గా కూడా ఉంటారు.
  • అర్థరాత్రి వరకు టీవీ – మొబైల్ చూడవద్దు: నిద్రపోకుండా ఉండటంలో మీ మొబైల్, టీవీ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి దాని వ్యసనాన్ని విడిచిపెట్టి త్వరగా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
  • మంచి ఆలోచనలు: నిద్రపోయే సమయంలో మంచి ఆలోచనలను మనస్సులో ఉంచుకోండి. తద్వారా హాయిగా నిద్ర పోవచ్చు.
  • టీ – కాఫీకి దూరంగా ఉండండి: నిద్ర శత్రువులు టీ, కాఫీ. దీని అధిక వినియోగం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
  • అరికాళ్లకు మసాజ్ చేయండి: పడుకునే ముందు చేతులు, కాళ్లు కడుక్కుని పడుకోవాలి. అలాగే ఏదైనా నూనెతో అరికాళ్లకు మసాజ్ చేయాలి. ఇది నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..