Milk Side Effects: పాలు ఎక్కువగా తాగితే ఇన్ని సమస్యలు వస్తాయా?

|

Aug 21, 2023 | 3:07 PM

పాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పాలు ఎముకలను ధృఢంగా ఉంచుతుంది. ఇవి శరీర ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇప్పటికే పాల గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. పాలను తీసుకుంటే ఎంత బెనిఫిట్స్ నో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొంతమంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం.. అతిగా తీసుకుంటే విషం. పాలు కూడా అంతే. పాలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు..

Milk Side Effects: పాలు ఎక్కువగా తాగితే ఇన్ని సమస్యలు వస్తాయా?
Milk
Follow us on

పాలు.. మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో ఒకటి. పాలలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే చిన్నవారైనా, పెద్దవారైనా రోజుకు ఒక గ్లాస్ పాలైన తాగమంటారు. పాలతో అనేక వాటిని తయారు చేసుకుంటాం. పాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పాలు ఎముకలను ధృఢంగా ఉంచుతుంది. ఇవి శరీర ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇప్పటికే పాల గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. పాలను తీసుకుంటే ఎంత బెనిఫిట్స్ నో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొంతమంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం.. అతిగా తీసుకుంటే విషం. పాలు కూడా అంతే. పాలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి రోజువారిలో పాలు ఎంత తాగాలి? ఎక్కువగా తాగితే ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్ని తాగాలి:

రోజుకు మూడు కప్పుల పాలను తీసుకోవచ్చు. కల్తీ లేని, రసాయన రహిత పాలను తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

అలసట:

పాలను రోజూ మూడు కప్పుల కంటే ఎక్కువగా తీసుకుంటే అలసట వస్తుందట. అతిగా తీసుకుంటే పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, దీని కారణంగా త్వరగా అలిసిపోయిన్టలు అనిపిస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. పాలలో ఉండే ఏ1 కేసైన్ కారణంగా ఇది జరుగుతుందట.

చర్మ సమస్యలు:

ఆరోగ్యం కదా అని అతిగా పాలు తీసుకుంటే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం వస్తుంది. అలర్జీలు, మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పాలలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉపయోగిస్తే.. చర్మం ఎరుపు రంగు రావడం, పగళ్లు, దద్దుర్లు వస్తాయి.

మెదడు మబ్బుబారిపోతుంది:

పాలు ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి నశించే అవకాశం ఉంది. మెదడు మబ్బుగా ఉంటుంది. పనిపై దృష్టి పెట్టలేకపోవడం, ఏకాగ్రత నశించడం వంటి సమస్యలు పాలు అతిగా తాగితే వస్తాయి. వయో వృద్ధులలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

జీర్ణ సమస్యలు:

పాలు ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అలాగే కడుపులో ఉబ్బరంగా, విరేచనాలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. మీ శరీరం లాక్టోస్ ను సరిగ్గా జీవక్రియ చేయలేకపోతే.. అది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

హార్మోన్ల సమస్యలు:

పాల ఉత్పత్తిని పెంచడానికి పాడి పరిశ్రమలో గ్రోత్ హర్మోన్లను వినియోగిస్తూ ఉంటారు. ఇలాంటి పాలు తాగడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యకు అంతరాయం కలిగిస్తాయి.

కాబట్టి వైద్యులు సూచించినట్టు రోజకు ఓ గ్లాస్ మిల్క్ తాగితే అది మన శరీరానికి అమృతంలా పని చేస్తుంది. మనకు కావాల్సిన పోషకాలు సక్రమంగా అందుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి