Shravana Masam: శ్రావణమాసంలో ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్‌ పాటించండి

|

Jul 17, 2022 | 6:19 PM

Shravana Masam 2022: శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం మొదలైంది. ఈ పవిత్రమాసంలో పరమశివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. ఈనెలలో శివ పార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి విశేష పూజలు చేస్తారు.

Shravana Masam: శ్రావణమాసంలో ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్‌ పాటించండి
Shravana Masam 2022
Follow us on

Shravana Masam 2022: శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం. ఈ పవిత్రమాసంలో పరమశివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. ఈనెలలో శివ పార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి విశేష పూజలు చేస్తారు. ఈ మాసంలో సాక్ష్యాత్తు శివుడు భూమి పైకి వస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే పార్వతీ దేవిని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. దీంతో చాలామంది విశేష పూజలతో పాటు ఉపవాసాలు పాటిస్తారు. ఈక్రమంలో మీరు కూడా శ్రావణ మాసంలో ఉపవాసం చేస్తున్నట్లయితే మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉపవాసం పాటించడం చాలా మంచిదైనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం రండి.

కొబ్బరి నీళ్లు

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లను ఉత్తమంగా పరిగణిస్తారు. ఒకవేళ కొబ్బరి నీళ్లు అందులబాటులో లేకపోతే అందకు సరిపడా నీళ్లను తాగాలి. ఇలా చేస్తే ఎక్కువగా ఆకలి ఉండదు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. గ్యాప్‌ ఇచ్చి పరిమిత మొత్తంలో మాత్రమే నీరు తాగాలి.

ఇవి కూడా చదవండి

పండ్లు

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో పండ్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఉపవాసంలో రోజంతా ఆకలితో ఉంటారు కాబట్టి ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది. ఈక్రమంలో రోజంతా హైడ్రేటెడ్ గా ఉండాలనుకుంటే, రోజుకు కనీసం మూడు సార్లు తాజా పండ్లను తీసుకోవాలి. అరటిపండును తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా దీనిని తిన్న తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆకలి కోరికలు కూడా అదుపులో ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లో ఉండే క్యాలరీలు, పోషకాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కాబట్టి అలసిపోయే సమస్య ఉండదు. ఉపవాస సమయంలో మధ్యమధ్యలో వాల్‌నట్‌లు, బాదంపప్పులు జీడిపప్పులను తింటూ ఉండండి. వాటిని తినడం వల్ల ఆకలి వేయదు. అలాగే కడుపు కూడా నిండుతుంది. ఆరోగ్యం కూడా క్షీణించదు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..