Kobbari Puvvu: కొబ్బరి పువ్వుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మీరు షాక్ తింటారు..

ఒక్కో సారి కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తుంటుంది. ఇలా పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కొందరు ఆ పువ్వును తింటారు కూడా. ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. అవేంటో తెలుసుకుందాం.

Kobbari Puvvu: కొబ్బరి పువ్వుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మీరు షాక్ తింటారు..
Coconut Flower
Follow us

| Edited By: KVD Varma

Updated on: Jan 24, 2022 | 10:55 PM

కొబ్బరికాయలు దేవుడి ముందు కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ లోపల పువ్వు కనిపిస్తే.. శుభం జరుగుతుందని చాలా మంది నమ్మకం. అది శుభమో..కాదో తెలియదు కానీ ఈ పువ్వు తింటే మాత్రం నిజంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వైద్యులు చెబుతున్నారు. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు ఉన్నఈ కొబ్బరి పువ్వులను కొబ్బరి గుడ్లు అని కూడా పిలుస్తారు. శీతాకాలం వచ్చిందంటే..కోనసీమలో విరివిగా పోషకాలు నిండిన ఈ పువ్వులు కనిపిస్తున్నాయి. ఏడాదికి ఒకసారి సీజనల్ గా దొరికే కొబ్బరి పువ్వులు ఆహార ప్రియులు ఇష్టంగా తింటారు.

వర్షపు నీటిలో తడవడం వల్ల కొబ్బరి కాయలలో ఈ పువ్వులు ఏర్పడతాయి. పూర్వం ఎక్కడో కొబ్బరి కాయలు పగులకొట్టి తీసుకువచ్చి  అమ్మేవారు. కానీ ఇప్పుడు హైవే చుట్టుపక్కగానే తాజాగా అప్పటి కప్పుడు కొబ్బర కాయలు కొట్టి..  తాజా పువ్వులు వేరు చేసి అమ్మడంతో వినియోగదారులు బాగా కొనుగోలు చేస్తున్నారు. రుచికి రుచి.. పోషకాలకు పోషకాలు ఎక్కువగా ఉండటంతో కొబ్బరి పూలు కొని తినడానికి క్యూ కడుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయనీ, కిడ్నీల్లో స్టోన్స్‌ రాకుండా సాయం చేస్తాయని చెబుతున్నారు.  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన మలబద్దకం సమస్యల బారిన పడకుండా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.

జుట్టుతో పాటు చర్మాన్ని కూడా అందంగా మార్చే శక్తి ఈ కొబ్బరి పువ్వుకు ఉందట. అంతే కాకుండా ముఖం మీద ముడతలు రావడం, మచ్చలు రావడం, చర్మం వదులవడం, ముఖం కళ కోల్పోవడం వంటి సమస్యల నుంచి ఈ కొబ్బరి పువ్వు కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పువ్వులో ఎక్కువ శాతం నీరు అలాగే ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాక శరీరం డీహైడ్రేట్ కాకుండా సహాయపడుతుంది.

కొబ్బరి పువ్వులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా కండర నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. అంతే కాకుండా క్రీడాకారులకు గొప్ప దేహదారుడ్యం రావాలి అంటే ఈ కొబ్బరి పువ్వు తినాల్సిందే.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎలాంటి అనుమానాలున్నా డైటీషియన్లను, ఆరోగ్య నిపుణులను సంప్రదించండి)

Also Read: సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్