Endometriosis: ఎండోమెట్రియోసిస్‌ బారినపడిన నటి.. ఈ వ్యాధి దేనికి సంబంధించింది.? దాని లక్షణాలు ఏంటి.?

| Edited By: TV9 Telugu

May 16, 2024 | 2:59 PM

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షమితా శెట్టి మాట్లాడుతూ.. 'లేడీస్, దయచేసి గూగుల్‌లో ఎండోమెట్రియోసిస్ కోసం సెర్చ్ చేయండి. దాని లక్షణాల గురించి తెలుసుకోండి. దానిని నిర్లక్ష్యం చేయవద్దు..' అంటూ మహిళలకు..

Endometriosis: ఎండోమెట్రియోసిస్‌ బారినపడిన నటి.. ఈ వ్యాధి దేనికి సంబంధించింది.? దాని లక్షణాలు ఏంటి.?
Shilpa Shetty's Sister Shamita Shetty
Follow us on

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షమితా శెట్టి మాట్లాడుతూ.. ‘లేడీస్, దయచేసి గూగుల్‌లో ఎండోమెట్రియోసిస్ కోసం సెర్చ్ చేయండి. దాని లక్షణాల గురించి తెలుసుకోండి. దానిని నిర్లక్ష్యం చేయవద్దు..’ అంటూ మహిళలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతక వ్యాధినా? ఇది మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం.. ఎండోమెట్రియోసిస్ అనేది మహిళలకు మాత్రమే వచ్చే ఓ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎండోమెట్రియం కణాలు గర్భాశయం లైనింగ్ వెలుపల పెరుగుతాయి. దీని ఫలితంగా గర్భాశయం, అండాశయాలు (పెరిటోనియం), ప్రేగు, మూత్రాశయం చుట్టూ ఉన్న కణజాలంలో గాయాలు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి

ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

  • పెల్విక్ నొప్పి
  • పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి
  • ప్రేగు కదలిక నొప్పి
  • మూత్రవిసర్జన సమయంలో నొప్పి
  • సంతానలేమి

అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ ప్రకారం.. సంతానలేమి కలిగి ఉన్న స్త్రీలలో మూడింట ఒక వంతు మంది ఎండోమెట్రియోసిస్ కలిగి ఉంటారు.

ఎండోమెట్రియోసిస్‌కు చికిత్స ఏమిటి?

ఎండోమెట్రియోసిస్‌కు చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఫలితంగా సంతాన లేమికి దారితీస్తుంది. అరుదైన సందర్భాల్లో ఎండోమెట్రియోసిస్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎండోమెట్రియోసిస్ నిర్ధారించడానికి దాని లక్షణాల ద్వారా తేలికగా గుర్తించవచ్చు. అలాగే డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ ద్వారా కూడా సమస్యను నిర్ధారించుకోవచ్చు. దీనిని లాపరోస్కోప్, కెమెరా, లెన్స్‌ అనే ఒక చిన్న పరికరం ఉపయోగించి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ విధంగా సమస్య నిర్ధారణ చేయబడుతుంది. శస్త్రచికిత్స చికిత్స ద్వారా ఎండోమెట్రియోసిస్ కణాలను సమూలంగా తొలగిస్తారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకునే సమయంలో వంగడం, అధిక బరువులు ఎత్తడం, కఠినమైన వ్యాయామం చేయడం వంటివి డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.