Breast Cancer: స్వీయ పరీక్షలతో రొమ్ము క్యాన్సర్ మరణాలను 40 శాతం తగ్గించొచ్చు.. నిపుణుల సూచనలివే..
ప్రపంచమానవాళిని వణికిస్తోన్న మాయదారి రోగం క్యాన్సర్. శరీరంలోని ఒక్కో భాగాన్ని తినేస్తూ మనిషి లేకుండా చేసే ఈ రోగంపై ప్రపంచం యుద్ధం చేస్తూనే ఉంది. ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్‌పై పోరు చేస్తున్నారు. ఇలా చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి రొమ్ము క్యాన్సర్ అవగాహన..

ప్రపంచమానవాళిని వణికిస్తోన్న మాయదారి రోగం క్యాన్సర్. శరీరంలోని ఒక్కో భాగాన్ని తినేస్తూ మనిషి లేకుండా చేసే ఈ రోగంపై ప్రపంచం యుద్ధం చేస్తూనే ఉంది. ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్‌పై పోరు చేస్తున్నారు. ఇలా చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల. బ్రెస్ట్ క్యాన్సర్‌ను చాలా మంది మహిళలు విస్మరిస్తుంటారు. డాక్టర్ వద్దకు వచ్చే సమయానికే 3 లేదా 4 స్టేజ్‌లో ఉండి ఉంటారు. దీంతో వీరు బతికే అవకాశాలు 10 నుంచి 20 శాతం మాత్రమే ఉంటుంది. దీని కారణంగా రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
నివేదికల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో 75 శాతం మంది ఇప్పటికే వ్యాధి 3 లేదా 4వ స్టేజ్‌లో ఉన్నట్లు తేలింది. మారుతోన్న జీవన విధానం, జంక్ ఫుడ్ తినడం, ఊబకాయం, కదలకుండా చేసే పని విధానం వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన అవగాహనతో క్యాన్సర్‌ను తరిమికొట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నెలకొకసారి స్వీయ పరీక్ష చేసుకోవడం ద్వారా భారత్‌లో 30 నుంచి 40 శాతం రొమ్ము క్యాన్సర్ బాధితులను ప్రాణాలతో కాపాడొచ్చని చెబుతున్నారు.
ఫరీబాదాబాద్‌లోని అమృత హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సఫాల్తా బాగ్మార్, రొమ్ము క్యాన్సర్‌పై పలు విషయాలను పంచుకున్నారు… ‘రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చు. 30 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళలకుకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుఉన్నాయి. రొమ్ము క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తించేందుకు 20 ఏళ్లు నిండిన మహిళలందరూ నెలకొకసారి రొమ్ము స్వీయ పరీక్షను నిర్వహించుకోవాలి. ముఖ్యంగా మహిళలు తమ రొమ్ములో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలి, రొమ్ములో గడ్డలు లేదా చర్మంపై మచ్చలను గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. అలాగే రొమ్ములో నొప్పి ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని సూచించారు.



అయితే భారత్‌లో చాలా మంది మహిళలకు రొమ్ము స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలో తెలియదు. రొమ్ములో గడ్డలు ఉన్నా వారు వాటిని విస్మరిస్తూ ఉంటారు. చివరి స్టేజ్‌లో డాక్టర్ల వద్దకు వస్తుంటారు. దీంతో వారు బతికే అవకాశాలు కేవలం 10 నుంచి 20 మాత్రమే ఉంటాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత ఆలస్యంగా గర్భం దాల్చడం లేదా అసలు సంతానమే కలగకపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పనిచేసే మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన రెండు నుంచి మూడు నెలల్లోనే పనిలో చేరుతారు. ఇలాంటి వారు బిడ్డకు పాలు ఇవ్వారు. ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఒక కారణంగా చెప్పొచ్చని డాక్టర్ వివరించారు.
ఇక బ్రెస్ట్‌ను తొలగించడంపై సీనియర్ కన్సల్టెంట్ & హెడ్, ప్లాస్టిక్ & రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగం, అమృతా హాస్పిటల్, ఫరీదాబాద్‌కు చెందిన డాక్టర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ..’క్యాన్సర్ కారణంగా రొమ్ము తొలగించిన చాలా మంది మహిళలు రొమ్ము రీప్లేస్‌మెంట్‌ను ఎంచుకుంటున్నారు. రొమ్ము రీప్లేస్‌మెంట్‌తో మహిళలు మానసికంగా ధృడమవుతారు. వారు మళ్లీ ఎప్పటిలాగే సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. రొమ్ము పునర్నిర్మాణం తర్వాత మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని మేము గుర్తించామ’ని మెహిత్ శర్మ తెలిపారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




