Health: ఈ పదార్థాలు ఎక్కువ తింటున్నారా.. గుండె జబ్బులకు కారణ కావచ్చు..

ఎక్కువ మంది దాహం వేసినా లేదా ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా వెంటనే మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి తరచుగా కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. అయితే ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల..

Health: ఈ పదార్థాలు ఎక్కువ తింటున్నారా.. గుండె జబ్బులకు కారణ కావచ్చు..
Heart
Follow us

|

Updated on: Oct 19, 2022 | 10:14 PM

ప్రస్తుతం జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే మారుతున్న లైఫ్ స్టైల్ తో అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. మనం తినే ఆహారాన్ని పై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఏవి పడితే అవి తినొద్దని చెబుతూ ఉంటారు. మొదట్లో మనకు తెలియకపోయినా, రోజుల గడిచే కొద్దీ ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి కొన్ని పదార్థాలు.  ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న వయసు వారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చాలా మంది గుండె పోటు కారణంగా తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో మనం తీసుకునే ఆహారంపై చాలా శ్రద్ధ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని చెడు వ్యసనాలతో పాటు.. కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడితే గుండె సంబధిత వ్యాధుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈదశలో ఎటువంటి ఆహారాలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం..గుండె జబ్బులు అధిక కొలెస్ట్రాల్‌తో మొదలవుతాయి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి, దీంతో రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. అధిక రక్తపోటు గుండెకు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

సిగరెట్ ,ఆల్కహాల్

సిగరెట్ ,ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులు, కాలేయానికి ఎక్కువ హానిని కలిగిస్తాయి. అలాగే నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది కాబట్టి హై బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు.

కూల్ డ్రింక్స్

ఎక్కువ మంది దాహం వేసినా లేదా ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా వెంటనే మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి తరచుగా కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. అయితే ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఆయిల్ ఫుడ్స్

చాలా మంది ఆహార ప్రియులు, స్పైసీ, నూనె ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కానీ ఆయిల్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం. ఆయిల్ ఫుడ్స్ వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ప్రాసెస్డ్ మీట్

ప్రస్తుత బిజీ షెడ్యూల్ లో ప్రాసెస్డ్ మీట్ ట్రెండ్ బాగా పెరిగింది. తరచుగా ప్రజలు ప్రోటీన్ పొందడానికి మాంసం తింటారు, కానీ ప్రాసెస్ చేసిన మాంసాల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది, గుండెపోటుకు దారితీస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..