Beauty Tips: అందమైన చర్మం కోసం రోజ్‌ వాటర్.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

|

May 23, 2022 | 8:34 PM

Beauty Tips: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఆరోగ్యకరమైన చర్మం కోసం రోజ్ వాటర్ ఉపయోగిస్తే మంచిది.

Beauty Tips: అందమైన చర్మం కోసం రోజ్‌ వాటర్.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Rose Water
Follow us on

Beauty Tips: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఆరోగ్యకరమైన చర్మం కోసం రోజ్ వాటర్ ఉపయోగిస్తే మంచిది. రోజ్‌ వాటర్‌ గులాబీ రేకుల నుంచి తయారుచేస్తారు. ఇది చర్మంపై సహజమైన మెరుపును తీసుకురావడానికి దోహదం చేస్తుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో మొటిమలు, వాపు, మచ్చలు మొదలైనవి ఉంటాయి. మీరు దీన్ని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీన్ని టోనర్, క్లెన్సర్, ఫేస్ ప్యాక్‌తో కలిపి చర్మంపై అప్లై చేయవచ్చు. రోజ్ వాటర్ ప్రయోజనాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

చర్మానికి మెరుపు తెస్తుంది

రోజ్ వాటర్‌లో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు ఉంటాయి. ఇది డార్క్, బ్లాక్‌ హెడ్స్‌ని తొలగిస్తుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపును తీసుకొస్తుంది.

ఇవి కూడా చదవండి

pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది

ఇది చర్మం pH స్థాయిని బ్యాలెన్స్‌ చేస్తుంది. ఇది మొటిమలు, అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

మొటిమలను నివారిస్తుంది

రోజ్ వాటర్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మొటిమల వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది.

చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది

రోజ్ వాటర్ చర్మం తేమను కాపాడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి పనిచేస్తుంది. వేసవిలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు రోజ్ వాటర్‌ని అప్లై చేయాలి.

ముడతలను తగ్గిస్తుంది

వృద్ధాప్యం కారణంగా చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. ఈ సందర్భంలో మీరు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. ఇది ముడతలు రాకుండా చేస్తుంది.

వడదెబ్బ నుంచి ఉపశమనం

రోజ్ వాటర్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. హానికరమైన UV కిరణాల నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. ఇది వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది

చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాల సమస్యను ఎదుర్కొంటారు. ఈ సందర్భంలో, మీరు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. ఇది తెల్లబడటం లక్షణాలను కలిగి ఉంటుంది. కళ్ల కింద నల్లటి వలయాల సమస్య నుంచి రక్షణ పొందేందుకు ఇవి పనిచేస్తాయి. మీరు గులాబీతో దూదిని నానబెట్టి కళ్లపై ఉంచవచ్చు. ఇది కళ్లకు గొప్ప ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి