
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో వందేళ్ల జీవితాన్ని సంపూర్ణ ఆయుష్షుగా చాలా మంది పేర్కొంటారు. అయితే ప్రస్తుతం సగం వయస్సుకే సమస్యలు వేధిస్తున్నాయి. అంటే యాభై ఏళ్ల వయస్సు అనేది ఓ మైలు రాయిగా మారింది. ముఖ్యంగా యాభై ఏళ్లు పైబడిన వారు తమ జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను షెడ్యూల్ చేయడానికి సమయాన్ని వెచ్చించడం ద్వారా ఏవైనా అంతర్లీన సమస్యలను తీవ్రంగా పరిణమించే ముందు గుర్తించగలరు. గత దశాబ్ద కాలంగా పురుషుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో ఉంచే జీవనశైలిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. పొగాకు, ఆల్కహాల్ వాడకం, ఆహారం, తక్కువ శారీరక శ్రమ వంటి జీవనశైలి కారకాలు క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధుల వంటి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. 50 ఏళ్లు పైబడిన పురుషులకు ఏదైనా ఆరోగ్య పరీక్షలో భాగంగా ఉండాల్సిన కొన్ని రోగనిర్ధారణ పరీక్షలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ తమ రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్‌ని తనిఖీ చేసుకోవాలి. మీరు ఊహించని బరువు తగ్గడం, నెమ్మదిగా నయం చేయడం లేదా అసాధారణ దాహం వంటి అధిక రక్తంలో చక్కెర లక్షణాలను కలిగి ఉంటే ఈ పరీక్షను చేయడం ఉత్తమం.
పూర్తి కొలెస్ట్రాల్ పరీక్ష మీ రక్తంలో నాలుగు రకాల లిపిడ్లు లేదా కొవ్వులను కొలుస్తుంది. రక్తంలోని మొత్తం కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్, అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను నిర్ణయించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. వీటిలో ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణించబడుతుంది. వీటిలో ఎక్కువ భాగం గుండెపోటు, స్ట్రోక్, అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
యాభై ఏళ్లు పైబడిన పురుషులకు అధిక రక్తపోటు ముఖ్యంగా ప్రమాదకరంగా మారుతుంది. ఇది గుండెపోటు, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే కొరోనరీ ఆర్టరీ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి యాభై ఏళ్లు పైబడిన వారు బీపీ పరీక్షలు తరచూగా చేసుకుంటూ ఉండాలి.
పురుషులందరికీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ప్రమాదం బాగా పెరుగుతుంది. పీఎస్‌ఏ పరీక్ష రక్తంలో ప్రోస్టేట్ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేసిన ప్రోటీన్ అయిన పీఎస్ఏ స్థాయిని కొలుస్తుంది. ఎలివేటెడ్ పీఎస్ఏ స్థాయిలు ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా ఇతర ప్రోస్టేట్ సంబంధిత పరిస్థితుల ఉనికిని సూచిస్తాయి. 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మధుమేహం, రక్తపోటు ఉన్న ప్రతి మనిషి తీవ్రమైన మూత్రపిండ వ్యాధులు అభివృద్ధి చెందే అవకాశంఉంది. అందుకే వారు మూత్రపిండాల పనితీరు పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించుకోవాలి.
గమనిక: ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..