Raisins Side effects: ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. రక్త హీనత సమస్య నుంచి ఉపశమనం కలిగించడం, శరీరంలోని ఇతర వ్యర్థాలను బయటికి పంపడంతో సహాయపడటం, ఐరన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తక్షణ శక్తిని ఇవ్వడంతో అద్భుతంగా పని చేస్తుంది. శీతాకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ ఎండుద్రాక్షను సిఫారసు చేస్తారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఈ ఎండుద్రాక్ష వల్ల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మితం అరోగ్యం.. అతి హానీకరం అని చెబుతున్నారు. ఎండు ద్రాక్షను అతిగా తినడం వల్ల భయంకరమైన దుష్ర్పభావాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ దుష్ర్పభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలకు కారణం..
ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎక్కువ డైటరీ ఫైబర్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సమస్య ఎదురవుతుంది. జీర్ణాశయం ఇతర పోషకాలను శోషించకుండా చేస్తుంది. ఇతర ఉదర సంబంధమైన సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కణజాలానికి నష్టం..
ఎండుద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలకు నష్టం వాటిల్లుతుందట. ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్, బయోఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండుద్రాక్షను మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తింటే.. అవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో కలిసిపోతాయి. ఆపై చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాజాలంపై ప్రభావం చూపుతాయి. ఆక్సీకరణ సమస్యను ప్రేరిపిస్తుంది.
బరువు పెరగడానికి కారణం..
ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఎండుద్రాక్షను మితంగా తీసుకోండి.
రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది..
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఎండుద్రాక్ష తినకూడదు. ఎండుద్రాక్షలో చక్కెర స్థాయి, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తినే ముందు నిపుణులను సంప్రదించడం తప్పనిసరి. మితంగా తింటే ప్రయోజనకరమేనని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
Srikanth Addala : మరో సినిమాను లైన్ లో పెట్టిన నటసింహం.. నారప్ప దర్శకుడితో బాలయ్య సినిమా..?
Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..
అమ్మకాలలో సరికొత్త మైలురాయిని సాధించిన టాటా.. EV కార్లకి పెరుగుతున్న ప్రజాధారణ..