Health: నిద్ర లేవగానే ముఖం ఉబ్బుగా కనిపిస్తుందా అయితే చాలా డేంజర్

ఉదయం లేవగానే మనలో కొందరికి ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. అయితే మీక్కూడా ఇలా కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ముఖంపై వాపు కనిపించడం కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యే అయినా మరికొన్ని సందర్భాల్లో మాత్రం చాలా డేంజర్‌ అని నిపుణులు...

Health: నిద్ర లేవగానే ముఖం ఉబ్బుగా కనిపిస్తుందా అయితే చాలా డేంజర్
Puffy Face

Edited By:

Updated on: Mar 08, 2024 | 8:12 PM

ఉదయం లేవగానే మనలో కొందరికి ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. అయితే మీక్కూడా ఇలా కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ముఖంపై వాపు కనిపించడం కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యే అయినా మరికొన్ని సందర్భాల్లో మాత్రం చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపించడానికి అసలు కారణాలేంటి.? ఏ వ్యాధికి ఇవి లక్షణాలు చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం..

* కొన్ని సందర్భాల్లో నిద్రలేమి సమస్యతో బాధపడే వారిలో కూడా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. రాత్రుళ్‌లు ఎక్కువ సమయం మేలుకువతో ఉండడం, స్మార్ట్‌ ఫోన్‌ వంటి గ్యాడ్జెట్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక రాత్రి పడుకునే ముందు తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బర్గర్-పిజ్జా, ప్రాసెస్ చేసిన మాంసం, చిప్స్‌ వంటి ఫాస్డ్‌ ఫుడ్‌ తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. ఈ ఆహారాలలో అధిక మొత్తంలో ఉండే సోడియం కారణంగా శరీరంలో నీరు పేరుకుపోతుంది, ముఖం ఉబ్బడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు.

* ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కూడా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ కారణంగా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు.

* హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడేవారిలో కూడా ఉదయం నిద్రలేవగానే ముఖం వాచినట్లు కనిపిస్తుంది. హార్మోన్ల తగినంత ఉత్పత్తి కాకాపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

* ఇక సైనసైటిస్ సమస్యతో బాధపడుతోన్న వారిలోనూ ఉదయం నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇదిలా ఉంటే ఉదయం నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే కొన్ని రకాల నేచురల్ టిప్స్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలని చెబుతున్నారు. అలాగే ముఖం మీదా టీ బ్యాగ్స్‌ పెట్టుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. దీంతో పాటు ముఖంపై మసాజ్‌ చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..