Prediabetes: డయాబెటిస్.. ఇది ప్రపంచాన్ని వెంటాడుతోంది. తినే ఆహారం, జీవన శైలి, కుటుంబ చరిత్ర కారణంగా డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ మధుమేహం (Diabetes) బారిన పడిపోతున్నారు. సాధారణం యువకులు రక్తంలో చక్కెర స్థాయిలు ప్రీడయాబెటిస్‌తో ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రీడయాబెటిస్ ఉండటం అంటే ఒకరి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఫాస్టింగ్ సమయంలో బ్లడ్ షుగర్ 100 నుంచి 125mg మధ్య ఉంటుంది. అయినప్పటికీ టైప్ -2 డయాబెటిస్‌గా నిర్ధారణ అయ్యేంత ఎక్కువగా ఉండదు. కానీ ప్రీడయాబెటిస్ సర్వసాధారణంగా టైప-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ ప్రిడయాబెటిస్ లేని వారితో పోలిస్తే ప్రీడయాబెటిస్ ఉన్న యువకులకు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరే అవకాశాలు 1.7 రేట్లు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రీడయాబెటిస్, చికిత్స చేయకుండా వదిలేస్తే ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌కు పురోగమిస్తుంది. ఇది ఒక వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది, అని యుఎస్‌లోని మెర్సీ క్యాథలిక్ మెడికల్ సెంటర్‌లో రెసిడెంట్ ఫిజీషియన్ అఖిల్ జైన్ అన్నారు.
యువకులలో గుండెపోటులు ఎక్కువగా జరుగుతున్నందున మా అధ్యయనం ఈ యువ జనాభాకు సంబంధించిన ప్రమాద కారకాలను నిర్వచించడంపై దృష్టి పెట్టిందని, తద్వారా భవిష్యత్తులో శాస్త్రీయ మార్గదర్శకాలు, ఆరోగ్య విధానాలు ప్రీడయాబెటిస్‌కు సంబంధించి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలను తగ్గించుకోవచ్చని అన్నారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ అవుట్‌కమ్స్ రీసెర్చ్ సైంటిఫిక్ సెషన్స్ 2022లో ఈ ఫలితాలు ప్రదర్శించబడ్డాయి.
18 నుండి 44 సంవత్సరాల వయస్సు గల యువకులలో గుండెపోటు సంబంధిత ఆసుపత్రిలో చేరినందుకు పరిశోధకులు 2018 సంవత్సరం నుండి రోగి ఆరోగ్య రికార్డులను సమీక్షించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన 7.8 మిలియన్లకు పైగా యువకులలో 31,000 కంటే ఎక్కువ మందికి ప్రీడయాబెటిస్‌తో సంబంధం ఉన్న రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్నాయని అధ్యయనం ద్వారా కొనుగోన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం, బరువు తగ్గడం వల్ల ప్రీడయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవచ్చని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి