పోషకాలు పుష్కలంగా ఉన్న వేరుశనగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చలికాలంలోనూ వీటిని డైట్‌లో చేర్చుకోవచ్చు. మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ మెరగవుతుంది. ఇందులోని పొటాషియం, కాపర్, కాల్షియం, మాంగనీస్, ఐరన్ తదితర పోషకాలు జీర్ణక్రియకు చాలా మంచివి. ఇక పచ్చి వేరుశనగలను ఖాళీ కడుపుతో తినడం వల్ల పలు ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరమవుతాయి. గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. డయాబెటిక్ రోగులకు ఇది మేలైన ఆహారం. అందుకే చలికాలంలో రోజువారీ ఆహారంలో కరకరలాడే, రుచికరమైన వేరుశనగలను చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వేరుశనగను కొందరు మాత్రం అసలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. వారెవరో తెలుసుకుందాం రండి.
జలుబు, దగ్గు కారణంగా కీళ్ల నొప్పుల సమస్యలు మొదలవుతాయి. అలాంటి పరిస్థితుల్లో వేరుశనగ ఎక్కువగా తీసుకుంటే, కీళ్ల నొప్పుల సమస్య మరింత తీవ్రతరమవుతాయి. ఇందులోని లెక్టిన్లు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేరుశనగ అసలు తినకండి. ఇక అధిక బీపీ ఉన్నవారు వేరుశెనగకు దూరంగా ఉండాలి. వేరుశెనగ తినడం వల్ల శరీరంలో సోడియం పెరుగుతుంది. అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇక చిక్‌పీస్ తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. ఇందులో ఉండే అధిక క్యాలరీలు వేగంగా బరువును పెంచుతాయి. ఇది ఊబకాయం, ఒబెసిటీ సమస్యలకు దారి తీస్తుంది. కాలేయ సమస్యలు ఉన్నవారు వేరుశనగను దూరం పెట్టడం మంచిది. వేరుశనగ తీసుకోవడం వల్ల శరీరంలో అఫ్లాటాక్సిన్ పరిమాణం పెరుగుతుంది. అఫ్లాటాక్సిన్ అనేది కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన పదార్ధం. కాబట్టి కాలేయ సమస్యలున్నవారు వీటిని అసలు తీసుకోకూడదు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..