ప్రోటీన్ పౌడర్.. గురించి చాలా మందికి తెలీదు. జిమ్ కి వెళ్లే వాళ్లు ఎక్కువగా ప్రోటీన్ పౌడర్ ను ఉపయోగిస్తూంటారు. ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. డైటీషియన్ సూచనల ప్రకారం కొంత మోతాదులో ఈ ప్రోటీన్ పౌడర్ ను తీసుకుంటారు. వీటిల్లో చాలా ఖరీదైనవి కూడా ఉంటాయి. వేలకు వేలు, లక్షలు కూడా వెచ్చించి మరీ ఈ ప్రొటీన్ పౌడర్ ను కొనుగోలు చేస్తూంటారు. అయితే ఈ ప్రోటీన్ పౌడర్ ఇంట్లోని లభ్యమయ్యే కొన్ని వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. వైద్యుల సూచనల ప్రకారం వీటిని తీసుకోవచ్చు. కానీ శరీరానికి కొంత మోతాదులో మాత్రమే ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఎక్కువ అయితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. పసుపు బఠాణీలతో కూడా ప్రొటీన్ పౌడర్ ను తయారు చేస్తున్నారు. ఈ ప్రొటీన్ పౌడర్ ను తయారు చేసుకోవచ్చు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు నిపుణులు. మరి పసుపు బఠాణీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
1. ఐరన్ ఎక్కువగా లభిస్తుంది:
బఠాణీ ప్రోటీన్ పౌడర్ లో ఐరన్ మెండుగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్య కూడా దరి చేరదు. ఒక వేళ ఉన్నా దీనితో తగ్గించుకోవచ్చు.
2. కొవ్వును కరిగిస్తుంది:
ఈ పౌడర్ తో చేసిన షేక్స్ తాగడం వల్ల కొవ్వును ఈజీగా కరిగిస్తుంది.
3. గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
ఈ ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా పని చేసేందుకు సహాయ పడుతుంది. రక్త పోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
4. బరువు తగ్గొచ్చు:
ఈ పౌడర్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుది. కాబట్టి కొద్దిగా తీసుకున్నా.. పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. దాంతో ఈజీగా బరువు తగ్గొచ్చు.
5. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది:
ఈ పౌడర్ ను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ చక్కా పని చేస్తుంది. బఠాణీలలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తిన్న ఆహారాలను నిల్వ ఉంచకుండా త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
6. కండరాలు బలంగా ఉంటాయి:
ఈ బఠాణీ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కండరాలు కూడా బలంగా, దృఢంగా తయారవుతాయి.
7. ఇలా తీసుకోవచ్చు:
ఈ బఠాణీ ప్రోటీన్ పౌడర్ ని స్మూతీస్, షేక్స్ లో కూడా కలుపుకుని సేవించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.