Smoking: మీరు పొగతాగుతారా..? అయితే బీకేర్ ఫుల్.. మీ పిల్లలు క్యాన్సర్ బారినపడే అవకాశాలున్నాయి..
Parent Smoking Leads To Cancer In Kids: సరదాగా అలవాటై వ్యసనంగా మారుతుంది ధూమపానం. స్టైల్ కోసం సిగరెట్ పట్టుకుంటే జీవితమే పొగమయం అవుతుంది. ధూమపానం సేవించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు ఎంత చెప్పినా...
Parent Smoking Leads To Cancer In Kids: సరదాగా అలవాటై వ్యసనంగా మారుతుంది ధూమపానం. స్టైల్ కోసం సిగరెట్ పట్టుకుంటే జీవితమే పొగమయం అవుతుంది. ధూమపానం సేవించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు ఎంత చెప్పినా పొగరాయుళ్లు మాత్రం పొగతాగడాన్ని ఆపలేరు. పొగతాగడం వల్ల వారితో పాటు వారి పక్కన ఉన్న వారికి కూడా హాని కలుగుతుందని మనందరికీ తెలిసిందే. అయితే కేవలం పొగతాగే సమయంలోనే కాదు.. పొగతాగే అలవాటు ఉన్న వారికి పుట్టబోయే పిల్లలకు కూడా దీని తాలుకు దుష్ప్రభావం ఉంటుందని మీకు తెలుసా.? తాజాగా బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ధూమపానం చేసే వారి వీర్యంలోని డీఎన్‌ఏ దెబ్బతుంటుందని ఈ కారణంగా వారికి పుట్టబోయే పిల్లలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి పరిష్కార మార్గం లేదా అంటే.. ఉందని చెబుతున్నారు శాస్ర్తవేత్తలు. పిల్లలు కనాలని ప్లాన్ చేసుకునే దంపతులు గర్భం దాల్చేందుకు మూడు నెలల ముందు నుంచి పురుషులు పొగతాగడం మానేయాలని సూచించారు. మూడు నెలలపాటు పొగతాడం మానేస్తే వీర్యంలోని డీఎన్‌ఏ తిరిగి మెరుగుపడుతందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి రాబోయే తరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జన్మించాలంటే వీలైనంత వరకు ధూమపానానికి దూరంగా ఉండడమే ఉత్తమమైన పని అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.