Paneer Benefits: పన్నీరు తినడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు.. కానీ ఏ సమయంలో తినాలంటే..!

|

May 10, 2022 | 6:29 AM

Paneer Benefits: బరువు తగ్గాలని ప్రయత్నించేవారందరికి ఒక ఆందోళన ఉంటుంది. అదేంటంటే ఏమి తినాలి.. ఏమి తినకూడదు. ఈ విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. అలాగే

Paneer Benefits: పన్నీరు తినడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు.. కానీ ఏ సమయంలో తినాలంటే..!
Paneer Benefits
Follow us on

Paneer Benefits: బరువు తగ్గాలని ప్రయత్నించేవారందరికి ఒక ఆందోళన ఉంటుంది. అదేంటంటే ఏమి తినాలి.. ఏమి తినకూడదు. ఈ విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. అలాగే పన్నీరు విషయంలో కూడా చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఇది తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్‌ కాదు. వాస్తవానికి పన్నీరుతో సులభంగా బరువుని కంట్రోల్‌ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. నిజానికి పన్నీర్‌ శాకాహారులకు ప్రోటీన్ అందించే ఒక సూపర్ ఫుడ్‌. బరువు తగ్గాలంటే ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినాలి. దీనివల్ల మీకు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. కాబట్టి తక్కువ ఆకలి వేస్తుంది. ఇది బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. పన్నీర్‌లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిది. దీన్ని పచ్చిగా లేదా ఆరోగ్యకరమైన రీతిలో ఉడికించి తీసుకోవచ్చు.

కార్బోహైడ్రేట్ తక్కువ

100 గ్రాముల ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్‌1.2 గ్రాముల కార్బోహైడ్రేట్లను ఇస్తుంది. అందువల్ల బరువు తగ్గే సమయంలో మీరు పన్నీర్‌ని తీసుకోవచ్చు. శరీరానికి అవసరమైన మంచి కొవ్వు పన్నీర్‌లో లభిస్తుంది. మీరు దానిని సరైన పరిమాణంలో తీసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 100 గ్రాముల పన్నీర్‌లో దాదాపు 72 కేలరీలు ఉంటాయి. మీరు ప్రతిరోజు టిఫిన్‌ సమయంలో 150 నుంచి 200 గ్రాముల పన్నీర్‌ తినవచ్చు. పన్నీర్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎర్ర రక్తకణాల అభివృద్ధికి సహకరిస్తుంది. మధుమేహం రాకుండా నిరోధిస్తుంది. పన్నీర్‌తో ఎముకలు, దంతాలు ధృఢంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. గర్భంలోని పిండాభివృద్ధికి సహకరిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది. వెన్నునొప్పి, కీళ్ల బాధల్ని తగ్గిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

MI vs KKR Highlights IPL 2022 : ముంబై 113 పరుగులకి ఆలౌట్‌.. 52 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలు ఉంటే అది విటమిన్‌ డి లోపం..!

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!