Painful Periods: ఆ సమయంలో నొప్పి మరీ భరించలేనంతగా ఉందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే! అది సంతానోత్పత్తిని దెబ్బతీయొచ్చు!

అయితే ఆ నొప్పి కొంత స్థాయి వరకే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరీ తట్టుకోలేని విధంగా నొప్పి వస్తుందంటే.. ప్రతి నెలా నొప్పి ఎక్కువవుతోంది అంటే మాత్రం జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు

Painful Periods: ఆ సమయంలో నొప్పి మరీ భరించలేనంతగా ఉందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే! అది సంతానోత్పత్తిని దెబ్బతీయొచ్చు!
Periods

Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2022 | 3:58 PM

నెలసరి వస్తుందంటనే యువతులు ఆందోళనకు గురవతారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని భరించలేక విలవిల్లాడిపోతుంటారు. రానురాను ఆ బాధను అలవాటు చేసుకుంటారు. అయినప్పటికీ ఒక రకమైన ఇబ్బంది ప్రతి నెల అనుభవిస్తూనే ఉంటారు. అయితే ఆ నొప్పి కొంత స్థాయి వరకే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరీ తట్టుకోలేని విధంగా నొప్పి వస్తుందంటే.. ప్రతి నెలా నొప్పి ఎక్కువవుతోంది అంటే మాత్రం జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అసలు నొప్పి ఎందుకు వస్తుంది.

సహజంగా శరీర కార్యకలాపాలు ప్రోస్టాగ్లాండిన్స్ నిర్వర్తిస్తుంటాయి. ఇవి శరీర కండరాల పని తీరు, కణాల వృద్ధి, శరీర ఉష్ణోగ్రత, మంట తదితరాలను నియంత్రిస్తుంటాయి. రుతుస్రావం సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ గర్భాశయ కండరాలను అధికంగా సంకోచించేలా చేస్తాయి. ఫలితంగా గర్భాశయంలోకి ఆక్సిజన్‌ ప్రవాహం తగ్గి విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది.

ఈ పరిస్థితి ఉంటే ఆందోళన.. ప్రతి నెలా ఉండే దాని కన్నా అధికంగా నొప్పి ఉంటే.. నెలనెల కూ నొప్పి తీవ్రతరం అవుతుంటే.. మీ శరీరం లోపల ఏదో సమస్య ఏర్పడినట్లు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు.. రుతుస్రావం అధికమవడం కారణంగా దీర్ఘకాలిక అనారోగ్యాల వస్తాయి. వీటి వల్ల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయం లోపల అభివృద్ధి చెందే కణితులు. ఇవి విపరీతమైన నొప్పి, బాధ కలుగజేస్తాయి. గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది.

ఎండోమెట్రియోసిస్: ఎండోమెట్రియోసిస్‌లో గర్భాశయ కణజాలం గర్భాశయం వెలుపలకు విస్తరించి, ఇతర కటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఇది గర్భాశయం సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడంతో పాటు గర్భధారణను ప్రభావితం చేస్తుంది. ఈ ఎండోమెట్రియోసిస్ కు సరైన చికిత్స లేదు. వంధ్యత్వానికి గురైన మహిళల్లో సగం మంది వరకు ఈ ఎండోమెట్రియోసిస్ బారిన పడి ఉండొచ్చని పరిశోధకుల నమ్మకం.

అడెనోమైయోసిస్: అడెనోమైయోసిస్‌లో గర్భాశయ కణజాలం గర్భాశయం వెలుపల వృద్ధి చెందుతుంది. ఇది విపరీతమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తరచుగా పీరియడ్స్ వస్తాయి. అయితే ఇది గర్భధారణను ప్రభావితం చేస్తుందనడానికి ఎటువంటి రుజువు లేదు. కానీ ఆ ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది.

ఇన్‌ఫ్లమేటరీ పెల్విక్ వ్యాధి: సాధారణంగా రుతుక్రమ సమస్యలు ఈ ఇన్‌ఫ్లమేటరీ పెల్విక్ వ్యాధి వలన సంభవిస్తాయి. ఇది ఫెలోపియన్ నాళాలు, గర్భాశయం, అండాశయం చుట్టూ మచ్చ కణజాలం ఏర్పడటం వల్ల వేరు చేయబడుతుంది. గర్భధారణ పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..