దగ్గు, జ్వరం, జలుబు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా కూడా కొందరు వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా మందులు వాడుతుంటారు. ఇంకొందరు వీర్యకణాల సమస్య, లైంగిక సమస్యలను అధిగమించేందుకు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇలా డాక్టర్ల సలహా లేకుండా ఇక అలా వాడేవారికి రోగాలు తగ్గడం అటుంచితే.. లేనిపోని సమస్యలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ వ్యక్తుల శృంగార సామర్ధ్యాన్ని తగ్గిస్తాయని వైద్య నిపుణులు గుర్తించారు. మరి ఆ మందులు ఏంటో తెలుసుకుందామా..
పెయిన్‌కిల్లర్లలో అనేక రకాలు ఉంటాయి. ఎలాంటి నొప్పినైనా దూరం చేయగలిగే శక్తి వీటికి ఉంటుంది. అయితే పెయిన్‌కిల్లర్లు అధికంగా వాడితే.. లైంగిక సామర్థ్యం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే వైద్యుల సలహా ప్రకారం, అవసరమైన మోతాదులోనే వీటిని వాడాలి.
డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. అయితే వీటిని లిబిడో కిల్లర్స్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువ వాడితే.. సెక్స్‌పై ఆసక్తి కోల్పోవడం, భావప్రాప్తి కలగకపోవడం, పురుషులలో అంగస్తంభన లోపం.. వంటి సమస్యలు ఏర్పడతాయని డాక్టర్లు చెబుతున్నారు.
పిల్లలు పుట్టకుండా, గర్భాన్ని వాయిదా వేసే మాత్రలు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి.
ఈ మందులను ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే వీటివల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఈ మెడిసిన్స్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలో జోక్యం చేసుకోవచ్చు. పురుషుల్లో అంగస్తంభన సమస్యలకు ఇవి కారణమవుతాయని అధ్యయనాల్లో తేలింది.
బెంజోడియాజిపైన్స్ అనేవి మత్తుమందులు. ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ మందులు ఎక్కువగా వాడేవారికి సంభోగంలో సంతృప్తి లేకపోవడం, అంగస్తంభన సమస్యలు వంటి దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం కలిగిస్తాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. అలాగే హై-బీపీకి వాడే మందులు.. మోతాదుకు మించితే.. అటు మహిళలకు, ఇటు పురుషులకు లైంగిక సమస్యలు తెచ్చిపెడతాయి.
తుమ్ములు, ముక్కు కారడం వంటి అలర్జీ సంబంధిత లక్షణాలను నియంత్రించడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. ఇవి మోతాదుకు మించి ఎక్కువ వాడే పురుషులు, మహిళల్లో లైంగిక సమస్యల బారిన పడవచ్చు.