చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్లను అమితంగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మన మూడ్ బట్టి చాక్లెట్స్ ఎక్కువగా తినేస్తుంటాము. అంతేకాదు.. వీటిని అతిగా తింటే లావుగా అవుతారని అంటుంటారు. అయితే చాక్లెట్స్ బరువు పెరగడంలో కాదు.. తగ్గించడానికి సహయపడుతుందని తాజా అధ్యయానాల్లో తేలింది. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంతోపాటు.. మహిళల నెలసరి సమస్యలను తగ్గించడంలోనూ చాక్లెట్స్ ఉపయోగపడతాయని వెల్లడైంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సోసైటీస్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ (FASEB) జరిపిన అధ్యయనంలో వైట్ చాక్లెట్స్ ఎక్కువగా తినడం వలన బరువు తగ్గడమే కాకుండా.. డయాబెటిస్ నియంత్రణ, ఆకలి, ఉపరితల ఆక్సీకరణ, మైక్రోబయోటాను ప్రభావితం చేస్తుందని తేలింది.
బరువు తగ్గడానికి చాక్లెట్..
కొందరు నెలసరి నిలిచిపోయిన మహిళలపై ఈ అధ్యయనం జరిపారు. ఇందులో వారు నిర్ధిష్ట మొత్తంలో చాక్లెట్స్ తినడం వలన రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గాయి. అలాగే బరువు పెరగలేదని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ గజెట్ నిర్వహించిన అధ్యయనంలో ఉదయం లేదా రాత్రిపూట చాక్లెట్స్ తినడం వలన ఆకలి, మైక్రోబయోటా తగ్గిపోవడం.. నిద్ర ఇలా ఎన్నో అంశాలపై ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది.
* ఉదయం చాక్లెట్స్ ఎక్కువగా తింటే కొవ్వును బర్న్ చేయడమే కాకుండా.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని తేలింది.
* అలాగే సాయంత్రం, రాత్రి వేళల్లో చాక్లెట్స్ తినడం వలన మరుసటి రోజు విశ్రాంతి, జీవక్రియలో మర్పులు జరుగుతున్నట్లుగా వెల్లడైంది.
హార్వర్డ్ అనుబంధ బ్రిఘం, ఉమెన్స్ ఆసుపత్రిలోని మెడిసిన్, న్యూరాలజీ విభాగాలకు చెందిన రచయిత మాట్లాడుతూ.. తినే ప్రక్రియ శరీర బరువును నియంత్రిచడమే కాదు.. శారీరక విధానాలపై కూడా ప్రభావం చూపిస్తుందని అన్నారు. చాక్లెట్స్ అధికంగా తినడం వలన కేలరీలు పెరిగాయి కానీ.. బరువు పెరగలేదు. చాక్లెట్స్ యాడ్ లిబిటమ్ ఎనర్జీ తీసుకోవడం తగ్గించాయని… ఆకలి కోరికలు తగ్గినట్లుగా తమ అధ్యయనంలో తేలిందన్నారు.
Karthika Deepam: లాయర్ ని కలిసిన దీప.. ఆరోజు ఏం జరిగిందో నిజం చెప్పమని ప్రియమణిని కోరుతున్న కార్తీక్