AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nerve Health: నరాల బలహీనత మటుమాయం.. ఈ ఒక్క చిట్కాతో నొప్పులు, వీక్నెస్‌కు చెక్!

మెదడు శరీరంలోని ప్రతి భాగాన్ని నియంత్రిస్తుంది. ఆ పని సరిగా చేయాలంటే నరాలు బలంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే, ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీని వలన తలనొప్పి, శరీర భాగాల్లో నొప్పి, తిమ్మిర్లు, చేతులు కాళ్లలో చీమలు పాకుతున్నట్టు అనిపించటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కేవలం అలసట లేక ఒత్తిడి కావచ్చు. లేక నరాల కుదింపునకు, నరాల్లో అడ్డంకులకు సంకేతం కావచ్చు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి. ఆ చిట్కాలు, వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Nerve Health: నరాల బలహీనత మటుమాయం.. ఈ ఒక్క చిట్కాతో నొప్పులు, వీక్నెస్‌కు చెక్!
Nerve Weakness Home Remedies
Bhavani
|

Updated on: Oct 19, 2025 | 8:28 PM

Share

నరాలు బలహీనపడటానికి సరైన రక్త ప్రసరణ లేకపోవడం ఒక ముఖ్య కారణం. నరాల బలహీనత లక్షణాలు: చేతులు, కాళ్లలో జీవం లేనట్లు అనిపించడం, తరచుగా వాపు, నొప్పి, తలతిరుగుతున్నట్టు అనిపించడం, చీమలు పాకుతున్నట్లు అనిపించడం. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవటం వలన రక్త ప్రసరణ మందగిస్తుంది. నరాలకు రక్తం సరిగా అందక అవి బలహీనపడతాయి. అయితే, ఈ సమస్య తగ్గించే ఐదు ఇంటి చిట్కాలు ఇవి:

మెంతులు (Fenugreek):

మెంతులు నరాల్ని బలోపేతం చేస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుపరుస్తాయి.

వీటిలో ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి నరాల వాపు, దృఢత్వాన్ని తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మెంతులు ప్రభావవంతంగా పని చేస్తాయి. నరాలు మూసుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వాడాల్సిన విధానం: రాత్రిపూట ఒక టీ స్పూన్ మెంతుల్ని నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి లేక దాని నీరు తాగాలి.

దాల్చిన చెక్క (Cinnamon):

దాల్చిన చెక్క సిరల వాపు, అడ్డంకి నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సిరలను బలోపేతం చేస్తాయి.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నరాల్లో పేరుకుపోయిన కొవ్వు, టాక్సిన్లు తొలగించడంలో సాయపడుతుంది.

వాడాల్సిన విధానం: ఉదయం 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీరు లేక తేనెతో తీసుకోవచ్చు.

నరాలకు మసాజ్:

నరాల బలహీనత, నొప్పి తగ్గించటానికి ఫోమెంటేషన్ (వేడి కాపడం) మంచి పరిష్కారం.

గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. వేడి బ్యాగ్ సాయంతో నరాలను మసాజ్ చేయండి. ఇది నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

అల్లం టీ (Ginger Tea):

నరాల్లో బలహీనత, నొప్పి తగ్గించటానికి అల్లం టీ ఉత్తమ ఎంపిక.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి నరాల్లో నొప్పిని తగ్గించగలవు.

తయారీ: ఒక కప్పు నీరు మరిగించి, తురిమిన అల్లం వేసి మరగించాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేసి, ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగాలి.

త్రిఫల పొడి (Triphala Powder):

ఆయుర్వేదంలో త్రిఫల పొడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నరాల నొప్పికి చికిత్స అందించడానికి దీనిని వాడతారు.

త్రిఫల పొడి నరాల్ని సడలిస్తుంది. నరాల బలహీనతను తొలగిస్తుంది.

వాడాల్సిన విధానం: త్రిఫల పొడిని నీటితో కలిపి తాగాలి.

ఈ చిట్కాలు పాటించడం వలన నరాల బలహీనత సమస్య తగ్గుతుంది.

Follow Us