Health Tips: వేప చెట్టు మీకు అందుబాటులో ఉందా..? ఎన్ని లాభాలో

| Edited By: Srikar T

Apr 06, 2024 | 7:22 PM

సిటీల్లో మనుషులకే ప్లేస్ ఉండటం గగనం. ఇక చెట్లకు ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఆ మున్సిపాలిటీ వాళ్లు వేసిన చెట్లే రోడ్లపై కనిపిస్తూ ఉంటాయి. అయితే పల్లెటూరిలో మాత్రం ప్రతి ఇంట్లో చెట్లు ఉంటాయి. అందులో వేప చెట్టు ఉండటం పక్కా.

Health Tips: వేప చెట్టు మీకు అందుబాటులో ఉందా..? ఎన్ని లాభాలో
Uses Of Neem Tree
Follow us on

సిటీల్లో మనుషులకే ప్లేస్ ఉండటం గగనం. ఇక చెట్లకు ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఆ మున్సిపాలిటీ వాళ్లు వేసిన చెట్లే రోడ్లపై కనిపిస్తూ ఉంటాయి. అయితే పల్లెటూరిలో మాత్రం ప్రతి ఇంట్లో చెట్లు ఉంటాయి. అందులో వేప చెట్టు ఉండటం పక్కా. ఈ ఎండాకాలం.. రాత్రి పూట ఆరు బయట పడుకుంటే.. ఆ వేప చెట్టు నుంచి వచ్చే గాలికి కమ్మటి నిద్ర పడుతుంది. వేపలో మనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

చర్మ సమస్యలకు బెస్ట్ మెడిసిన్..

వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో సూపర్‌గా పని చేస్తాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వేపను అనేక ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. యాంటీవైరల్, అనామ్లజనకాలు, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వేపలో ఉంటాయి. సబ్బులు, షాంపూల తయారీలోనూ వేపను వాడతారు.

చక్కెర స్థాయిలు..

లేత వేప ఆకు మితంగా తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వేపలోని టెర్పెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయట. అంతే కాకుండా వేపలో రక్తాన్ని క్లీన్ చేసే గుణాలు కూడా ఉన్నాయట. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. వేప ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్యకు చెక్ పెట్టవచ్చు

ఇవి కూడా చదవండి

అసిడిటీ..

వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడమే కాకుండా దగ్గు నుంచి రిలీఫ్ ఇస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా వేప తగ్గిస్తుందట. వేప ఆకులు అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా మటుమాయం చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..