Skin to Hair Sollution: చలికాలంలో జుట్టు, చర్మంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ సీజన్‌లో చర్మం, జుట్టులో పొడిబారడం మొదలవుతుంది. అయితే, ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో అనేక ఉత్పతతులు అందుబాటులో ఉన్నప్పటికీ అవి చాలా ఖరీదైనవి, వీటి ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. ఈ నేపథ్యంలో శీతాలకంలో ఎదురయ్యే సమస్యలకు సహజ పరిష్కారాలను చూపుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇందులో ముఖ్యంగా వేప అమూల్యమైన ఔషధ గనిగా పేర్కొంటున్నారు. వేపలో ఔషద మూలకాలు పుష్కలంగా ఉన్నాయనే విషయం తెలిసిందే. దాని ఆకులు, కాండం నుండి వేరు వరకు అన్ని సమస్యలను అధిగమించడానికి ఉపయోగిస్తారు. చర్మం నుంచి వెంట్రుకల వరకు అన్ని సమస్యలను దూరం చేయగల వేపనూనె కూడా మార్కెట్‌లో అమ్ముడవుతోంది. వేప వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
బలహీనమైన జుట్టును బలపరుస్తుంది..
వేప నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. మీ జుట్టు త్వరగా పెరగకపోతే, మీరు వేప ఆకులను నీటిలో ఉంచి, దానితో జుట్టును కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు బాగా పెరగడం ప్రారంభమవుతుంది.
చుండ్రును దూరం చేస్తుంది..
వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు సమస్యను తొలగిస్తాయి. అలాగే తలలో వాపు, దురద, మంట, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తాయి. ఈ సమస్యను అధిగమించాలంటే జుట్టుకు వేప నూనె వాడటం, వేప ఆకుల నీళ్లతో జుట్టు కడుక్కోవడం చేస్తే ఉపశమనం కలుగుతుంది.
పేను సమస్యను దూరం చేస్తుంది..
చిన్న పిల్లల్లో ఈ పేను సమస్య అధికంగా ఉంటుంది. వేప నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేపనూనెలో ఉండే క్రిమిసంహారక ఏజెంట్లు పేను సమస్యను దూరం చేస్తుంది.
చర్మ వ్యాధులను నయం చేస్తుంది..
చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా వేపనూనె సమర్థవంతంగా తొలగిస్తుంది. వేప నీటితో స్నానం చేయడం వల్ల దురద, అలర్జీ, తామర మొదలైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మొటిమలు మాయం..
వేప ఆకులను చూర్ణం చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే చర్మంలోని మొటిమల సమస్య తొలగిపోతుంది. కావాలంటే దీని ఆకులను ఎండబెట్టి పొడి చేసి ప్యాక్ లా వేసుకోవచ్చు.
బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్..
ముల్తానీ మట్టిలో వేప పొడిని కలిపి తీసుకుంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫేస్ ప్యాక్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది.
Also read:
Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..
RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!
Kamal Haasan: విక్రమ్ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్.. సినిమా విడుదల ఎప్పుడంటే!