Navaratri Fasting Tips: నవరాత్రికి ఉపవాస దీక్షను చేపట్టారా.. ఆరోగ్యంగా ఉండడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..

|

Sep 29, 2022 | 4:00 PM

ఉపవాసం హానికరమైన టాక్సిన్స్‌ను శరీరం నుంచి బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే ఆహార మార్పుల కారణంగా.. ఉపవాసం శరీరాన్ని నీరసంగా లేదా అలసిపోయేలా చేస్తుంది. అయితే నవరాత్రి ఉపవాస దీక్షా సమయంలో ఆరోగ్యంగా

Navaratri Fasting Tips: నవరాత్రికి ఉపవాస దీక్షను చేపట్టారా.. ఆరోగ్యంగా ఉండడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..
Fasting Tips
Follow us on

Navaratri Fasting Tips 2022: నవరాత్రుల సమయంలో అమ్మవారి అనుగ్రహం కోసం చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం చేసే సమయంలో సరైన పద్ధతులు పాటించకపోతే బలహీనపడతారు. హిందువులు ఎంతో పవిత్రంగా ఇష్టంగా చేసుకొనే నవరాత్రి సమయంలో.. దుర్గా దేవిని పూజిస్తూ భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం శుభప్రదంగా పరిగణించబడడమే కాకుండా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఒక అద్భుతమైన మార్గం.  ఎందుకంటే ఉపవాసం హానికరమైన టాక్సిన్స్‌ను శరీరం నుంచి బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే ఆహార మార్పుల కారణంగా.. ఉపవాసం శరీరాన్ని నీరసంగా లేదా అలసిపోయేలా చేస్తుంది. అయితే నవరాత్రి ఉపవాస దీక్షా సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించండి.

ఉపవాస నియమం:
నవరాత్రుల్లో ప్రతిరోజూ 14 నుండి 16 గంటల ఉపవాస దీక్షను పాటించండి. మిగిలిన సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి.  2, 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కొంచెం కొంచెం తీసుకోండి.  ఇలా ఉపవాసం చేయడం సులభం, సురక్షితం. గ్యాస్ వంటి ఇబ్బందులు ఏర్పడవు.

ఫైబర్ కోసం పండ్లు
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ప్రేగు కదలికకు సహాయపడే విధంగా ఫైబర్‌ అధికంగా ఉండే పండ్లను ఆహారంగా తీసుకోండి. మంచి సాత్వికాహారం తీసుకోండి. పాలు, మజ్జిగ, బంగాళదుంపతో చేసిన సాబుదానా ఖిచిడీ, పరాటా వంటి వాటిని తినే ఆహారపదార్ధాల్లో చేర్చుకోండి. అయితే ఈ భోజనంలో చక్కెర లేకుండా ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం
ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని మనం హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరం హైడ్రేట్‌గా ఉంటే ఆకలి కలగదు. అంతే కాదు.. నీరు త్రాగడం వల్ల అలసట కలగదు. ఉపవాస సమయంలో నీరసం రాకుండా సహాయపడుతుంది. కనుక ఎప్పుడూ వాటర్ బాటిల్‌ని దగ్గర ఉంచుకుని సకాలంలో నీటిని తాగుతూ ఉండండి.

మలబద్ధకం నివారణ కోసం చల్లని పాలు
తొమ్మిది రోజుల ఉపవాసం ఖచ్చితంగా శరీరాన్ని నీరసంగా చేస్తుంది. అయితే ఉపవాస సమయంలో ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కొంతమందిలో ఆమ్లత్వం లేదా మలబద్ధకం ఏర్పడవచ్చు. దీనిని ఎదుర్కోవటానికి, చల్లని పాలు త్రాగాలి. అసిడిటీని అరికట్టడానికి ఆహారంలో నిమ్మరసం లేదా పెరుగుని కూడా చేర్చుకోవచ్చు.

జీర్ణం అయ్యే  ఆహారం:
చివరగా నీరసం కలగకుండా త్వరగా జీర్ణయ్యమే విధంగా బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులను తీసుకోవాలి. వీటిల్లో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఉదయం అల్పాహారానికి ముందు త్వరగా ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యిను జోడించండి. రాత్రిపూట నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ జీర్ణాశయానికి సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఈ వ్యాసంలో  పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే.. వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. ఏదైనా ఫిట్‌నెస్ విధానాన్ని లేదా వైద్య సలహాను ప్రారంభించే ముందు దయచేసి వైద్యుడిని సంప్రదించండి.)