ఎముకలను ఉక్కులా మార్చే బ్రహ్మాస్త్రం.. నల్లేరు మొక్క కాదు నయం కానీ రోగాలకు సంజీవని
ఆయుర్వేదంలో విశేష ప్రాధాన్యం కలిగిన నల్లేరు మొక్క ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే ఈ ఔషధ మొక్క ఎముకల పగుళ్లను త్వరగా నయం చేయడంలో, కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆయుర్వేదంలో నల్లేరు మొక్క (సిస్సు క్వాడ్రాంగులారిస్)కి గొప్ప ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం ఒక మొక్క కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఔషధ గుణాల గనిగా పరిగణిస్తారు. శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో దీనిని వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. నల్లేరులో కాల్షియం, విటమిన్ ‘సి’ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి నల్లేరు ప్రధానంగా ఎముకల ఆరోగ్యానికి పేరుగాంచింది. ఎముకల పగుళ్లను త్వరగా నయం చేయడంలో, ఎముకల సాంద్రతను పెంచడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి నల్లేరు ఉపశమనం అందిస్తుంది. దీనిలోని శోథ నిరోధక గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
- జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా నల్లేరు మొక్క దోహదపడుతుంది. ఇందులో పీచు (ఫైబర్) అధికంగా ఉండటం వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి, జీర్ణశక్తిని పెంచుతుంది.
- ఇంకా, షుగర్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- నల్లేరులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తినిచ్చి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
- మహిళల సమస్యలను కూడా నియంత్రించడంలో నల్లేరు ఉపయోగపడుతుంది. బహిష్టు సమయంలో వచ్చే నొప్పులను, మెనోపాజ్ సమయంలో ఎముకల బలహీనతను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- ఈ ఆయుర్వేద మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నల్లేరు వాడే విధానం:
నల్లేరు కాడలను చిన్న ముక్కలుగా చేసి, పచ్చడి లేదా రొట్టె రూపంలో తీసుకోవచ్చు. మోతాదుకు మించి కాకుండా పరిమితంగా వాడటం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా ఆరోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా .. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
గమనిక: నల్లేరు వంటి ఆయుర్వేద మొక్కలను ఔషధంగా ఉపయోగించే ముందు వైద్యులు లేదా అర్హత కలిగిన ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
