Weight Loss Diet: బరువు తగ్గాలంటే వీటిని తినడం అస్సలు మర్చిపోకండి..!
బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన పోషకం. దీని వల్ల శరీరంలో ఉన్న కండరాలు బలంగా మారుతాయి. అలాగే అదనపు కేలరీలు తగ్గుతాయి. శరీర బరువు సమర్థవంతంగా తగ్గుతుంది. అందుకే ప్రతి రోజు ప్రోటీన్ ను సరిపడా తీసుకోవడం అవసరం.

మన శరీరానికి అన్ని పోషకాలూ అవసరం. వాటిలో ప్రోటీన్ కీలకంగా నిలుస్తుంది. ప్రోటీన్ తగ్గితే శారీరక ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. చిన్నపిల్లల్లో పెరుగుదల సమస్యలు వస్తాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. హార్మోన్లు సమతుల్యం కోల్పోతాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో తరచూ జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
శాఖాహారులు ఎక్కువగా ప్రోటీన్ లోపానికి గురవుతారు అన్న అభిప్రాయం ఉంది. కానీ సరైన ఆహారం తీసుకుంటే తగినంత ప్రోటీన్ పొందవచ్చు. మాంసాహారంలో లభించే పూర్తి ప్రోటీన్ లు కొన్నిసార్లు శాఖాహారంలో లభించకపోవచ్చు. అందుకే అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు ఉన్న ఆహారాలను కలిపి తినాలి.
చిక్ పీస్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ వంటి పప్పులలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫైబర్, ఐరన్ తో కూడినవి కూడా.. వీటిని సాంబారులో లేదా కర్రీలలో చేర్చడం ద్వారా రోజూ తినవచ్చు.
బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి తృణధాన్యాలు శుద్ధి చేసిన ధాన్యాలతో పోలిస్తే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. క్వినోవా పూర్తిగా ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది శాఖాహారులకు మంచి ఎంపిక.
బాదం, వేరుశెనగ, గుమ్మడికాయ గింజలు, చియా, అవిసె గింజలు మంచి ప్రోటీన్ వనరులు. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఖనిజాలు కూడా ఇస్తాయి. పెరుగు, స్మూతీలపై వేసుకోవచ్చు లేదా నేరుగా తినవచ్చు.
సోయా ఆధారిత పదార్థాలు మంచి ప్రోటీన్ అందిస్తాయి. టోఫు వేయించవచ్చు, గ్రిల్ చేయవచ్చు లేదా సూప్ లలో వేసుకోవచ్చు. సోయా పాలు తాగడం కూడా శ్రేయస్కరం.
పాలు, పెరుగు, జున్ను, గుడ్లు వంటి పదార్థాలు పూర్తిగా ప్రోటీన్ ఉన్నవే. ఇవి రోజూ తీసుకుంటే శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది. ముఖ్యంగా క్రీడాకారులు, టీనేజర్లకు ఇవి అత్యంత అవసరం.
రోజు మొత్తానికి కావలసిన ప్రోటీన్ అందేందుకు పప్పులు, ధాన్యాలు, గింజలు, విత్తనాలు, పాల పదార్థాలు, సోయా పదార్థాలను సమతుల్యంగా తీసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నంలో వాటిని భాగంగా చేసుకోవాలి. ఒకే రకమైన ఆహారం కాకుండా.. వేర్వేరు రకాల ఆహారాలను చేర్చాలి.
శరీరం బలంగా ఉండాలంటే ప్రోటీన్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా శాఖాహారులు ఆహారాన్ని ప్లాన్ చేసుకుని ప్రతి రోజు తగినంత ప్రోటీన్ పొందేలా చూసుకోవాలి. ప్రోటీన్ మంచి ఆరోగ్యం, బలమైన కండరాలు, బరువు తగ్గే శక్తికి కీలకం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
