Vitamin-D Deficiency: యువతలోనే ఆ లోపం ఎక్కువ.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు

విటమిన్-డి లోపం వల్ల శరీరానికి వచ్చే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ప్రొస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్, మధుమేహం, రుమయాటెడ్ ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య రుగ్మతలకు విటమిన్-డి లోపం కారణంగా నిలుస్తుంది.

Vitamin-D Deficiency: యువతలోనే ఆ లోపం ఎక్కువ.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
Vitamin D

Updated on: Feb 03, 2023 | 2:35 PM

విటమిన్ -డి ని సాధారణంగా సన్ షైన్ విటమిన్ అంటారు. శరీరంలోని కాల్షియం, పాస్ఫేట్ ను నియంత్రించడంలో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది క్రమంగా ఎముకలు, దంతాలు, కండరాలను బలపరుస్తుంది. ఓ నివేదిక ప్రకారం పిల్లల్లో రికెట్స్ వంటి ఎముక వైకల్యాలు, పెద్దల్లో ఆస్టియోమలాసియా వల్ల కలిగే ఎముకల నొప్పిని నివారించడంలో విటమిన్-డి బాగా పని చేస్తుంది. విటమిన్-డి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో? విటమిన్-డి లోపం వల్ల శరీరానికి వచ్చే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ప్రొస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్, మధుమేహం, రుమయాటెడ్ ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య రుగ్మతలకు విటమిన్-డి లోపం కారణంగా నిలుస్తుంది. అయితే భారతదేశంలోని చాలా మంది జనాభా విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాదాపు దేశ జనాభాలో 76 శాతం మంది విటమిన్ -డి తో బాధపడుతున్నారు. 27 నగరాల్లో 2.2 లక్షల మందికి నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. పురుషుల్లో 79 శాతం మంది, స్త్రీలల్లో 75 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

యువతలోనే అధిక ప్రభావం

తాజా పరిశోధనల్లో కేవలం 25 ఏళ్ల లోపు వయస్సున్న యువతే ఎక్కువ ప్రభావితమవుతన్నారని వెల్లడైంది. దాదాపు 84 శాతం ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని తేలింది. అయితే 25-81 సంవత్సరాల మధ్య ఉన్న వారు 81 శాతం మంది ఈ లోపంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. సాధారణంగా అయితే పురుషుల్లో 79 శాతం మంది, స్త్రీలల్లో 75 శాతం మంది ఈ లోపంతో బాధపడుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్ల వల్లే ఈ సమస్య పెరగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సూర్య రస్మి శరీరానికి తగులకుండా ఉండడం కూడా విటమిన్-డి లోపంతో బాధపడతున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే శీతాకాలంలో ఆహార లోపం ఉన్నా కూడా విటమిన్-డి లోపానికి గురవుతారని పేర్కొంటున్నారు. గర్భిణులు, బాలింతల్లో విటమిన్-డి లోపం ఉంటే వారికి పుట్టబోయే బిడ్డలో విటమిన్-డి లోపించే అవకాశం ఉంది. 

విటమిన్ -డి లోపాన్ని దూరం చేయండిలా

స్థూల కాయం, మాల్ -అబార్షన్, ఆస్టియోమలాసియా, టీబీ చికిత్స పొందుతున్న రోగులు శరీరంలోని విటమిన్-డి స్థాయిలను ఎల్లప్పుడూ తనిఖీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లలు, 5 ఏళ్లలోపు పిల్లల్లు 55 ఏళ్లు దాటిన వృద్ధులు కనీసం ఆరు నెలలకోసారైనా పరీక్షలు చేయించుకోవాలి. అలాగే శరీరానికి ఎండ తగిలేలా వ్యాయామం చేయాలి. గుడ్లు సొనలు, మేక మాంసం, విటమిన్ -డి ఎక్కువగా లభించే పోషకాహారాన్ని పుష్టిగా తినాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే శరీరంలో విటమన్-డి శాతం పెరుగుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..