Monkeypox Alert: ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ వైరస్.. భారత్‌లో అడుగు పెట్టేనా..? ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!

|

May 21, 2022 | 10:11 AM

ఆఫ్రికా నుంచి ఇతర దేశాల్లో అడుగు పెట్టిన మంకీ వైరస్.. ఉపఖండంలో కూడా అడుగు పెట్టే అవకాశం ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా భారత్ దేశంలో పర్యాటక సీజన్ మొదలైనందున ఈ మంకీ పాక్స్ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Monkeypox Alert: ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ వైరస్.. భారత్‌లో అడుగు పెట్టేనా..? ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
Monkeypox Disease
Follow us on

Monkeypox Alert: ఆఫ్రికా(Africa) నుంచి యూరప్ (Europe), అమెరికా(American), ఆస్ట్రేలియా(Australia) వంటి అనేక దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్ .. ఇంకా భారత్ లో అడుగు పెట్టలేదు. ఇప్పటి వరకూ ఈ వైరస్ కు సంబంధించిన ఎటువంటి అనుమానిత కేసులు నమోదు కాలేదు.. అయినప్పటికీ మంకీ పాక్స్ వైరస్ ఉపఖండంలో అడుగు పెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. భారత్ దేశంలో పర్యాటక సీజన్ మొదలైనందున ఈ మంకీ పాక్స్ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కెనడా క్యూబెక్‌లో మొదటి రెండు కేసులను ధృవీకరించింది. మరో 30 మందికి కూడా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇక మంకీ వైరస్ యూరప్, ఉత్తర అమెరికాలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. స్పెయిన్,  పోర్చుగల్ లో 40కి పైగా అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించారు. ఇది ఐరోపాలో అరుదుగా కనిపించే వైరల్ ఇన్‌ఫెక్షన్. కనుక భారత్ ఆందోళన చెందాలా? అనే విషయంపై హెల్త్ నిపుణులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్ మెడిసిన్ హెడ్ డాక్టర్ బెహ్రామ్ పార్దివాలా న్యూస్ 9 తో మాట్లాడుతూ ఇప్పటివరకు దేశంలో ఎటువంటి మంకీ వైరస్ కేసులు వెలుగులోకి రాలేదని చెప్పారు. “అయితే.. దేశంలో పర్యాటకులు, దేశ విదేశాల్లో ప్రయాణాలు అధికం అయ్యాయి.. కనుక ఇప్పటి నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణంగా, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మానవ సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకలు, స్వలింగ సంపర్కుల్లో ఈ మంకీ వైరస్ సంక్రమణ అధికంగాఉంటుందని కూడా భావిస్తున్నామని “డాక్టర్ పార్దివాలా చెప్పారు.

ప్రయాణాలు చేసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే ఇన్‌ఫెక్షన్‌ భారత్‌కు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు. “చర్మంపై దద్దుర్లు ఉన్నవారికి దూరంగా ఉండాలి. మంకీపాక్స్ అనేది దాగి ఉండే ఇన్ఫెక్షన్ కాదు. చర్మం అంతటా స్ఫోటములు (పసుపు ద్రవంతో నిండిన చర్మంపై ఉబ్బిన పాచెస్) ఉంటాయని డాక్టర్ పార్దివాలా వివరించారు.

ఇవి కూడా చదవండి

వ్యాధి సోకిన వ్యక్తికి పుండ్లు ఏర్పడిన తర్వాత.. ఆ వ్యక్తి నుంచి మరొక వ్యక్తికీ మంకీపాక్స్ సోకుతుందని చెప్పారు. “వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకాలంటే చాలా దగ్గరి సంబంధంలో ఉండాలి.. రెండు అడుగుల కంటే తక్కువ దూరం ఉండాలి. బాధితుడి నుంచి తగిన దూరంలో ఉంటె.. అవతలి వారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం లేదు” అని డాక్టర్ పార్దివాలా చెప్పారు.

వ్యాప్తి రేటు: మానవులకు సంక్రమించే వ్యాధి. ఇప్పటివరకు మానవుని నుండి మానవునికి మాత్రమే వ్యాపిస్తున్నప్పటికీ  వ్యాప్తి రేటు 3.3 శాతం నుండి 30 శాతంగా అంచనా వేయబడింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇటీవలి వ్యాప్తిలో, ప్రసార రేటు 73 శాతంగా అంచనా వేయబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరి చివరి వారంలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ కారణంగా మొత్తం 75 కేసులు నమోదు కాగా..ఇద్దరు మరణించినట్లు నివేకలు వెల్లడించారు. ఇక  2022 మొదటి రెండు నెలల కాలంలో  704 కేసులు,  37 మరణాలు నమోదయ్యాయి.

మంకీపాక్స్ అంటే ఏమిటి? ఇది అరుదైన వ్యాధి అయినప్పటికీ.. సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే.  సాధారణంగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అడవి జంతువుల్లో వెలుగులోకి వచ్చింది. NHS వెబ్‌సైట్ ప్రకారం, ఈ వ్యాధి మశూచికి సంబంధించినది. దీని వలన ముఖం మీద దద్దుర్లు ఏర్పడతాయి. మొదటిసారిగా 1970లలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో రికార్డ్ లో వెలుగులోకి వెలుగులోకి వచ్చింది. గత దశాబ్దంలో పశ్చిమ ఆఫ్రికాలో కేసుల సంఖ్య పెరిగింది.

ఈ వైరస్‌ను గుర్తించిన WHO: ఒక సమావేశంలో..  ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రతినిధి మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..  “మేము మా ప్రాంతీయ కార్యాలయం, ఇతర ఏజెన్సీలతో చాలా సన్నిహితంగా పని చేస్తున్నామని చెప్పారు. ఈ కేసుల నుంచి ఇన్ఫెక్షన్ మూలాను, ఫార్వార్డ్ కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను విశ్లేషిస్తున్నామని తెలిపారు. దీని “మంకీపాక్స్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పారు. మంకీ వ్యాధి సోకిన వ్యక్తులను ఒంటరిగా ఉంచడంతో పాటు పరీక్షలు జరుగుతున్నాయని వాన్ కెర్ఖోవ్ చెప్పారు. (Source)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..