Migraine: ఈ కారణాల వల్ల మైగ్రేన్‌ వేధిస్తుంది.. అవేంటో తెలుసుకోండి..

| Edited By: Ravi Kiran

Apr 25, 2022 | 7:45 AM

Migraine: ఈ రోజుల్లో చాలామంది తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇది రావడానికి చాలా కారణాలున్నాయి. కొందరికి ఒత్తిడి, నిద్రలేమి కారణంగా తలనొప్పి వస్తుంది.

Migraine: ఈ కారణాల వల్ల మైగ్రేన్‌ వేధిస్తుంది.. అవేంటో తెలుసుకోండి..
Migraine
Follow us on

Migraine: ఈ రోజుల్లో చాలామంది తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇది రావడానికి చాలా కారణాలున్నాయి. కొందరికి ఒత్తిడి, నిద్రలేమి కారణంగా తలనొప్పి వస్తుంది. ఇంకొందరికి జీవనశైలి లోపాల వల్ల తలనొప్పి సమస్య తలెత్తుతుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారు తీవ్రమైన నొప్పితో బాధపడాల్సి వస్తుంది. మైగ్రేన్ రోగులలో తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటివి సర్వసాధారణం. ఇది నాడీ సంబంధిత సమస్య. మైగ్రేన్‌లో తలలో ఒక వైపున తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది చికిత్స తీసుకోకుండా తగ్గదు. మైగ్రేన్ నొప్పి 5-6 గంటల కంటే ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ రావడానికి చాలా కారణాలున్నాయి. మైగ్రేన్‌ కారణాలు, లక్షణాల గురించి తెలుసుకుందాం.

మైగ్రేన్‌ కారణాలు..

1. నిద్రలేమి: కొందరికి నిద్రలేమి సమస్య ఉంటుంది. దీనివల్ల తలనొప్పి సమస్య పెరుగుతుంది. నిద్ర లేకపోవడం అలసట, బలహీనతకు దారితీస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితిలో మైగ్రేన్ సమస్య పెరుగుతుంది.

2. ఆందోళన, ఒత్తిడి: ఈ రోజుల్లో అన్ని వ్యాధులకు మూలం ఆందోళన, ఒత్తిడి. దీని కారణంగా మైగ్రేన్ నొప్పి కూడా పెరుగుతుంది. కొందరికి ఆఫీసు పని, టెన్షన్ వల్ల తలనొప్పి వస్తుంటుంది. ఇది మైగ్రేన్‌కి కారణం అవుతుంది.

3. యాసిడ్ లేదా గ్యాస్ కలిగి ఉండటం: కొంతమందికి యాసిడ్ ఏర్పడటం వల్ల మైగ్రేన్ సమస్య ఉంటుంది. అలాంటి వారు తలనొప్పి సమయంలో ఖచ్చితంగా వాంతులు చేసుకుంటారు. అలాంటి వారు గ్యాస్ అధికంగా ఉండే ఆహారాలని తినకూడదు. ఖాళీ కడుపుతో అస్సలు ఉండకూడదు.

4. ఎండ వేడి: వేసవిలో ఎండవేడి వల్ల మైగ్రేన్ పెరుగుతుంది. ఎండలో తిరిగి అకస్మాత్తుగా AC గదిలోకి వెళ్లినా మైగ్రేన్ వస్తుంది. అధిక వేడి వల్ల తలనొప్పి సమస్య తీవ్రతరం అవుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. ఇవి చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు..!

IPL 2022: విరాట్‌ కోహ్లీ నాలుగు లేదా ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయాలి.. భారత మాజీ ఆటగాడి సలహా..!

IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడి ‘సూపర్ మ్యాన్’ అయ్యాడు.. ఎవరో తెలుసా..?