Meningitis Symptoms: నవజాత శిశువుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వాలి.. లేకపోతే ప్రాణాంతకమే
మెనింజైటిస్ అని పిలిచే ఈ సమస్య ప్రస్తుతం ఎక్కువ మంది చిన్నారుల్లో కనిపిస్తుందని అంటున్నారు. ఇది మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల మధ్య ప్రాణాంతక మంటగా వస్తుంది. ఎవరైనా ఈ పరిస్థితికి గురవుతారు. ఎక్కువగా నవజాత శిశువులు దీని బారిన పడతారు.

పిల్లల ఆరోగ్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. చిన్న సమస్య ఉన్నా వెంటనే అలర్టవ్వాలని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఓ కొత్త సమస్య కనిపిస్తుందని చిన్న పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. మెనింజైటిస్ అని పిలిచే ఈ సమస్య ప్రస్తుతం ఎక్కువ మంది చిన్నారుల్లో కనిపిస్తుందని అంటున్నారు. ఇది మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల మధ్య ప్రాణాంతక మంటగా వస్తుంది. ఎవరైనా ఈ పరిస్థితికి గురవుతారు. ఎక్కువగా నవజాత శిశువులు దీని బారిన పడతారు. వీరికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణంగా నవజాత శిశువులకు రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందదు. మెనింజైటిస్ వంటి ఇన్ఫెక్షన్లగా పిలిచే దీన్ని గుర్తించడం చాలా కష్టం. సాధారణంగా పెద్దల్లో కనిపించే లక్షణాలు నవజాత శిశువుల్లో కనిపించకపోవచ్చు. ముఖ్యంగా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ ఈ పరిస్థితికి కారణంగా ఉంటుంది. బాక్టీరియల్ మెనింజైటిస్ అంటే వ్యాధి అత్యంత తీవ్రమైన రూపంగా చూడాలి. ఇది వినికిడి లోపం, మెదడు దెబ్బతినడం, మరణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. మరోవైపు వైరల్ మెనింజైటిస్, సాధారణంగా తక్కువ తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు చికిత్స లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. నవజాత శిశువులో మెనింజైటిస్ లక్షణాలు కనిపిస్తే, వారికి సరైన వైద్య సహాయం అందేలా చూసుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మెనింజైటిస్ లక్షణాలు
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం కొంచెం పెద్ద వయస్సు వచ్చిన పిల్లల్లో మెనింజైటిస్ వస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆకస్మిక జ్వరం, తలనొప్పి, మెడ గట్టిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వికారం, వాంతులు, ఫోటోఫోబియా లేదా మానసిక స్థితిని మార్చడం వంటి ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మెనింజైటిస్ ఉన్న పెద్దలకు సత్వర చికిత్స మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది.
శిశువుల్లో ప్రధాన లక్షణాలు
నవజాత శిశువులకు మైనింజైటిస్ ఉంటే ప్రధానంగా కొన్ని లక్షణాలను గమనించవచ్చు. వారికి సాధారణంగా ఉండే లక్షణాల కంటే కొన్ని లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఆకలి లేకపోవడం, బద్ధకంగా ఉండడం, కామెర్లు, పొట్ట ఉబ్బడం, నిరంతరం ఏడుస్తూ ఉండడం, నుదురు వద్ద ఉబ్బడం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, మూర్చ వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఇతర వ్యాధులు ఉన్నా వస్తాయి కాబట్టి లక్షణాలపై జాగురకతతో వ్యవహరించి మైనింజైటిస్‌ను గుర్తించడం ముఖ్యం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..