Banana Flower: అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.. ముఖ్యంగా అతివలకు..

ఇందులో అల్లం, కొత్తిమీర ఆకులు చక్కగా కట్‌చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కలుపుకుంటే మంచిది. దీన్ని వారానికి ఐదుసార్లు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.

Banana Flower: అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.. ముఖ్యంగా అతివలకు..
Banana Flower

Updated on: Dec 28, 2022 | 12:12 PM

అరటి పండు మాత్రమే కాదు.. పువ్వులో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అరటి పువ్వులో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. అరటి పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా ఉన్నాయి. అరటి పువ్వులో ఉండే అధిక పొటాషియం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు. హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించటానికి, రక్తహీనత నివారణకు అరటి పువ్వ ఎంతో దోహదకారి.

శరీరంలో వ్యాధికారక బాక్టీరియా పెరగకుండా అరటి పువ్వు మందు వలే పనిచేస్తుంది. దీనిలోని అనామ్లజనిత లక్షణాలు క్యాన్సర్, గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది. మధుమేహం ఉన్నవారికి ఇది గొప్ప ఆహారం. పువ్వులో ఉండే ప్లేవానాయిడ్స్ అద్భుతమైన ఇన్సులిన్ వాహకాలుగా పనిచేస్తాయి.

అరటి పువ్వుతో చేసిన వంటకాలు తినటం వల్ల కిడ్నీలో రాళ్లను తొలగింపజేస్తుంది. వంద మిల్లీగ్రాముల అరటి పువ్వు రసాన్ని ఉదయం మూడుసార్లు తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు అరటి పువ్వుతో చేసిన సూప్ తీసుకుంటే మంచిది. ఇందులో అల్లం, కొత్తిమీర ఆకులు చక్కగా కట్‌చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కలుపుకుంటే మంచిది. దీన్ని వారానికి ఐదుసార్లు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కడుపు పూత నివారణకు అరటిపువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. మూత్ర విసర్జన చేసేటపుడు బాధాకరంగా ఉంటే అరటి పువ్వను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.. శ్వాసలో తాజాదనం, చెమటలో దుర్వాసన రాకుండా అరికడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండి విపరీతంగా వాంతులు అవుతుంటే అరటి పువ్వను తీసుకుంటే మంచిది. అరటి పువ్వుతో చేసిన వంటకాన్ని రోజూవారీ తీసుకుంటే స్త్రీలకు శక్తి, గర్భాశయ సమస్యలు తలెత్తవు. అరటి పువ్వు రసాన్ని తేనెతో ఉదయం వేళ పరగడపున తీసుకుంటే రుతుస్రావ సమస్యలన్నీ తొలగిపోతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి