AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calcium:కాల్షియం సమస్యకు చెక్‌ పెట్టే ఆహారాలు.. ఎదిగే పిల్లలకు ఎంతో అవసరం..

పిల్లల్లో కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి బారిన కూడా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు

Calcium:కాల్షియం సమస్యకు చెక్‌ పెట్టే ఆహారాలు.. ఎదిగే పిల్లలకు ఎంతో అవసరం..
Calcium Rich Food
Jyothi Gadda
|

Updated on: Dec 28, 2022 | 11:42 AM

Share

శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కాల్షియం ఎంతో ముఖ్యం. ఇది మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపించడంలో కాల్షియం ప్రముఖ పాత్రపోషిస్తుంది. అంతేకాదు ఇది కండరాలు, హార్మోన్ల రిలీజ్, సంకోచ వ్యాకోచాలకు కూడా సహయపడుతుంది. ముఖ్యంగా కాల్షియం అస్థిపంజర పనితీరుకు ఎంతో అవసరం. కాల్షియం పుష్కలంగా ఉన్నప్పుడు అస్థిపంజరం పనితీరు మెరుగ్గా ఉంటుంది. కానీ, ఈ రోజుల్లో చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. కాల్షియం లోపాన్ని హైపోకాల్షిమియ అని వైద్య పరిభాషలో అంటారు. దీనికి తగిన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ప్రమాదకరమైన ఎముకలు సన్నబడే రోగం బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు పిల్లల్లో కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి బారిన కూడా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

​బాదంపప్పులు 100 గ్రాముల బాదంలో 60 mgకాల్షియం, మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది.

​మేడి పండు 8 మేడి పండ్లలో 241 mg కాల్షియం ఉంటుంది. రోజూ తీసుకుంటే, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

రాజ్మా బీన్స్ 100 గ్రాముల పచ్చి రాజ్మా బీన్స్లో 140 mg కాల్షియం ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా మంచిది. జీర్ణవ్యవస్థ ఒత్తిడిని తగ్గించడానికి, సులభంగా జీర్ణమయ్యేలా చేయడానికి రాజ్మాను ఉడకబెట్టుకుని తినటం మంచిది.

​నువ్వులు ఇది మీ రోజువారీ పోషక అవసరాలకు 88 mg కాల్షియంను అందిస్తుంది. ప్రతిరోజూ 1 టేబుల్ స్పూన్ నువ్వులు తినాలని చెబుతున్నారు. నువ్వులలో జింక్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి.

​పొద్దుతిరుగుడు గింజలు ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలలో 109 mg కాల్షియం ఉంటుంది. ఈ విత్తనాలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం ప్రభావాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

​బ్రోకలీ ఒక కప్పు బ్రోకలీలో 87 mg కాల్షియం ఉంటుంది. బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం మూత్రాశయం, రొమ్ము, పెద్దప్రేగు, కాలేయం, కడుపు క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది.

తాటి ముంజలు తాటి ముంజలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు కావలసిన పోషకాలను అందించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

పాలు, పెరుగు, జున్ను, పనీర్, రసమలై వంటి ఆహారాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. కూరగాయలైన పాలకూర, బచ్చలికూర, బఠానీలు ,తృణధాన్యాలు బీన్స్‌లో కూడా కాల్షియం ఉంటుంది.

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)