Weird Animals: వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు.. చూసి షాక్‌ అవుతున్న జనాలు.. ఎలా ఉన్నాయో చూడండి..

రెండు నిమిషాల 19 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4.9 మిలియన్లు అంటే 49 లక్షల సార్లు వీక్షించగా, వందలాది మంది కూడా వీడియోను లైక్ చేసారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Weird Animals: వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు..  చూసి షాక్‌ అవుతున్న జనాలు.. ఎలా ఉన్నాయో చూడండి..
Weird Animals
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 28, 2022 | 9:11 AM

ఒకప్పుడు భూమిపై రాక్షస జంతువులు ఉండేవి. అవి నేటి కాలంలో కనిపించే పెద్ద జంతువుల కంటే చాలా రెట్లు పెద్దవి. చాలా ప్రమాదకరమైనవి కూడానూ. ఇందులో డైనోసార్ పేరు ముందు వరుసలోకి వస్తుంది. అయితే, ఆ కాలంలో డైనోసార్లే కాకుండా అనేక రకాల భారీ జంతువులు ఉండేవని మీకు తెలుసా ? ఆ రోజుల్లో మొసళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. వాటి గురించి తెలిస్తే చాలు ఒంట్లో వణుకు పుడుతుంది. ఇప్పుడు కూడా అలాంటి రాక్షస జీవులు భూమిపై కనిపించనప్పటికీ, అలాంటి వింత జంతువులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటిని చూసి ప్రజలు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ వీడియోలో కొన్ని వింత, రాక్షస జీవులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి. వాటి సైజు చూస్తుంటే ఈ లోకంలోని జీవులు కాదేమో అనిపిస్తుంది. వీడియో ప్రారంభంలో ఒక భారీ మొసలి బహుశా ఎరను వెతుక్కుంటూ రోడ్డుపై తిరుగుతున్నట్లు మీరు చూడవచ్చు. దాని భయంకరమైన శరీరాన్ని, కోణాల దంతాలను చూస్తే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. దీని తరువాత సింహం వంటి వింత జంతువు ఒకటి వచ్చింది. కానీ, అది సింహం కంటే చాలా రెట్లు పెద్దది. వీడియోలో తిరుగుతుంది. అప్పుడు ఒక ప్రమాదకరమైన డ్రాగన్ కూడా ఎత్తైన భవనాల మధ్య ఎగురుతూ కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో వింత, అంతుచిక్కని రహస్య జీవులు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

వీధుల్లో సంచరించే వింత, రహస్య జీవులను చూసి మీరు అయోమయానికి గురైనప్పటికీ, వీడియో చివరి భాగాన్ని చూస్తుంటే, ఇది ఖచ్చితంగా సినిమాలోని సన్నివేశం అని అనిపిస్తుంది. ఈ వీడియో నిజంగానే ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంది. వీడియో @TheFigen_ అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది.

రెండు నిమిషాల 19 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4.9 మిలియన్లు అంటే 49 లక్షల సార్లు వీక్షించగా, వందలాది మంది కూడా వీడియోను లైక్ చేసారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వీధుల్లో సంచరించే వింత జంతువులు యానిమేషన్ చిత్రాలని కొందరంటే, ఇది నిజం కాదు అని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో కొంతమంది వినియోగదారులు ఇది బిగ్ మ్యాన్ జపాన్ చిత్రానికి సీక్వెల్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి