AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Leaves Juice: యంగ్‌గా కనిపించాలి అనుకుంటున్నారా.. ఈ జ్యూస్ తాగాల్సిందే!

మునగాకు పోషకాల గని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మునగాకులో మనకు కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ అనేవి సమృద్ధిగా లభ్యమవుతాయి. కడుపుతో ఉన్న వాళ్లు మునగాకు తింటే రక్త హీనత సమస్య తగ్గడమే కాకుండా.. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే మునగాకులో రెండింతల పోషకాలు లభ్యమవుతాయి. బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇతర ఎలాంటి అనారోగ్య సమ్యలు ఉన్నవారైనా మునగాకు తింటే..

Moringa Leaves Juice: యంగ్‌గా కనిపించాలి అనుకుంటున్నారా.. ఈ జ్యూస్ తాగాల్సిందే!
Moringa Leaves Juice
Chinni Enni
|

Updated on: Jan 22, 2024 | 8:17 PM

Share

మునగాకు పోషకాల గని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మునగాకులో మనకు కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ అనేవి సమృద్ధిగా లభ్యమవుతాయి. కడుపుతో ఉన్న వాళ్లు మునగాకు తింటే రక్త హీనత సమస్య తగ్గడమే కాకుండా.. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే మునగాకులో రెండింతల పోషకాలు లభ్యమవుతాయి. బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇతర ఎలాంటి అనారోగ్య సమ్యలు ఉన్నవారైనా మునగాకు తింటే వాటికి చెక్ పెట్టొచ్చు. చర్మ సమస్యలు, జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా మునగాకు జ్యూస్‌‌తో తగ్గించుకోవచ్చు. మరి ఈ మునగాకు జ్యూస్‌తో ఎలాంటి ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్‌గా కనిపిస్తారు:

మునగాకు జ్యూస్ తాగడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. మీ వయసు ఎంత పైబడినప్పటికీ.. తరుచుగా మునగాకు జ్యూస్‌ తాగితే మీరు ఎవర్ యూత్‌గా కనిపిస్తారు. అంతే కాకుండా ముఖంపై మచ్చలు, పింపుల్స్ వంటివి తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మెరిసి పోతుంది. యంగ్‌గా కనిపించాలి అనుకునే వారికి మునగాకు జ్యూస్ బెస్ట్ అని చెప్పొచ్చు.

కంటి చూపు మెరుగు పడుతుంది:

మునగాకు రసం తాగడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. వృద్దాప్యంలో కూడా కంటి చూపు చక్కగా కనిపిస్తుంది. కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా మునగాకు జ్యూస్‌ తాగితే.. అదుపులోకి తీసుకురావచ్చు.

ఇవి కూడా చదవండి

ఎముకలు బలంగా మారతాయి:

ప్రస్తుతం ఈ రోజుల్లో చాలా మంది ఎముకలకు సంబంధించిన నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన ఎముకల సమస్యలకు కూడా మునగాకుతో తగ్గించుకోవచ్చు. రెగ్యులర్‌గా మునగాకు జ్యూస్ తాగితే ఎముకలు బలంగా మారతాయి.

చక్కెర్ స్థాయిలను తగ్గిస్తుంది:

మునగాకులో చక్కెర స్థాయిలను తగ్గించే పదార్థాలు ఉంటాయి. బ్లడ్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు మునగాకు రసం తాగడం వల్ల.. షుగర్ లెవల్స్ అనేవి అదుపులోకి వస్తాయి.

గుండెకు మేలు చేస్తుంది:

గుండె జబ్బులకు ప్రధాన కారణం.. రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం. మునగాకు జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి కంట్రోల్‌లోకి వస్తాయి. మొరింగ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
పుల్లంగా, కారంగా.. నిమ్మకాయ పులిహోర అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి
పుల్లంగా, కారంగా.. నిమ్మకాయ పులిహోర అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి