జామ పండు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేదోడి యాపిల్ పండుగా జామ పండుని పిలుస్తారు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండటమే కాకుండా కాస్త తక్కువ ధరకు లభిస్తాయి. యాపిల్ లో ఎన్ని విటమిన్స్, మినరల్స్, పోషకాలు ఉన్నాయో.. జామ పండులో కూడా అన్నే ప్రయోజనాలు ఉంటాయి. జామ పండుతో కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా జామ కాయతో షైనీ స్కిన్ తో పాటు, ముడతలు వంటివి కూడా రాకుండా చేస్తుంది. జామ కాయతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
సాఫ్టీ అండ్ గ్లో స్కిన్:
సాఫ్టీ అండ్ మెరిసే చర్మం కోసం జామ పండుతో క్యారెట్ ముక్కలు కలిపి ఒక ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక జామ పండు, అర కప్పు క్యారెట్ ముక్కలను కలిపి రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఇందులో కొద్దిగా నీరు పోసుకోవాలి. దీన్ని ఓ 15 నిమిషాల పాటు ఉంచుకుని కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మీ ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఆ తేడాను మీరు గమనిస్తారు.
ఛాయను మెరుగు పరుస్తుంది:
చర్మ ఛాయను పెంచుకోవాలంటే.. బాగా పండిన ఒక జామ పండును తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. దీనికి గుడ్డు పచ్చ సొనను యాడ్ చేసి.. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ కి మాస్క్ గా వేసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. స్కిన్ కలర్ లో తేడా వస్తుంటుంది.
మృత కణాలను తొలగించుకోండి:
మృత కణాలను తొలగించుకోవడానికి జామ పండును స్క్రబ్ లా కూడా వాడొచ్చు. ఒక జామ పండును, రెండు జామ ఆకులు, ఓట్ మీల్ తీసుకుని మీక్సి చేసుకోవాలి. దీన్ని ఫేస్ కి స్క్రబ్ లా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే మృత కణాలు తొలగిపోయి.. ముఖం క్లియర్ గా మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.