Malaria: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల కేసులు వేగంగా పెరిగే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం రోడ్లపై నిలిచిన నీరు, దుమ్మూ ధూళి. కలుషితమైన నీటి కారణంగా దోమలు సులభంగా వృద్ధి చెందుతాయి. దీంతో మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చెందుతాయి. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.మలేరియా, డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మలేరియా వచ్చినప్పుడు వైద్య చికిత్స చాలా ముఖ్యం. అయితే కొన్ని ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ జీవితంలో కూడా వీటిని అలవర్చుకుంటే మలేరియాతో పాటు మరెన్నో వ్యాధులు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్న మాట.
అల్లం పొడి, నీరు:
అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇది వివిధ వ్యాధుల నుండి కాపాడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే మీరు మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను తట్టుకోగలరు. అల్లం పొడిని తీసుకుని నీళ్లలో కలుపుకుని తాగాలి. ఆయుర్వేదంలో కూడా అల్లం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది.
బొప్పాయి ఆకు, తేనె:
మలేరియా లేదా డెంగ్యూ కారణంగా శరీరంలోని ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతాయి. ఈ స్థితిలో ఔషధాలే కాకుండా, దేశీయ ప్రిస్క్రిప్షన్లు కూడా అవలంబించబడతాయి. ఇక బొప్పాయికి సంబంధించిన పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రజలు ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచుకోవచ్చు. బొప్పాయి ఆకుల్లో అనేక గుణాలు ఉన్నాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తాయి. బొప్పాయి ఆకులను నీటిలో వేసి మరిగించి అందులో తేనె మిక్స్ చేసి ఉదయాన్నే ఈ హెల్తీ డ్రింక్ తాగండి. ఇది మలేరియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
మెంతులు:
స్వదేశీ పద్ధతుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయానికి వస్తే మెంతులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మెంతుల్లో యాంటీ-ప్లాస్మోడియం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మలేరియా వైరస్‌ను తొలగించడానికి పనిచేస్తుంది. మెంతి గింజల రెసిపీని అనుసరించడానికి దాని గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నీటిని తాగాలి. కావాలంటే నానబెట్టిన గింజలను పేస్టులా చేసుకుని కూడా తినవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)