కెమికల్ టూత్ పేస్టులు వాడటం కంటే.. ఇలా నేచురల్ గా ఇంట్లోనే రెడీ చేయండి!

|

Sep 17, 2023 | 3:30 PM

మన నోరు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం తీసుకునే ఆహారం కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి ఆహారం తీసుకున్నా.. నోటిలోని క్రిములు, బ్యాక్టీరియా కలిస్తే అది కూడా కలుషితం అవవుతుంది. అవి కాస్తా లోపలికి వెళ్లి గడబిడ చేస్తాయి. కాబట్టి టూత్ పేస్టులను వాడే ముందు మంచివి ఎంచుకోవాలి. నోటి శుభ్రం చాలా ముఖ్యం. పురాతన కాలంలో అయితే వేప పుల్లని వాడేవారు. వేప పుల్లతో నోరంతా క్లీన్ అయ్యేది. నోట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా చేదు తగిలే సరికి నశించేవి. ఇక రాను రాను వేప పుల్లలతో బ్రష్ చేయడం కష్టమవుతుంది. అయితే ఇప్పుడు దొరికే టూత్ పేస్టుల్లో అన్నీ కెమికల్స్ నే..

కెమికల్ టూత్ పేస్టులు వాడటం కంటే.. ఇలా నేచురల్ గా ఇంట్లోనే రెడీ చేయండి!
Toothpast
Follow us on

మన నోరు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం తీసుకునే ఆహారం కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి ఆహారం తీసుకున్నా.. నోటిలోని క్రిములు, బ్యాక్టీరియా కలిస్తే అది కూడా కలుషితం అవవుతుంది. అవి కాస్తా లోపలికి వెళ్లి గడబిడ చేస్తాయి. కాబట్టి టూత్ పేస్టులను వాడే ముందు మంచివి ఎంచుకోవాలి. నోటి శుభ్రం చాలా ముఖ్యం. పురాతన కాలంలో అయితే వేప పుల్లని వాడేవారు. వేప పుల్లతో నోరంతా క్లీన్ అయ్యేది. నోట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా చేదు తగిలే సరికి నశించేవి. ఇక రాను రాను వేప పుల్లలతో బ్రష్ చేయడం కష్టమవుతుంది. అయితే ఇప్పుడు దొరికే టూత్ పేస్టుల్లో అన్నీ కెమికల్స్ నే కలుపుతున్నారు. దీంతో ఇంకా లేని పోని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి టూత్ పేస్ట్ ను కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. టూత్ పేస్ట్ ని ఇంట్లో ఎలాగా అని ఆలోచిస్తున్నారా. ఇంట్లో ఉండే సహజ పదార్థాలతోనే చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి.

ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్లో దొరికే అన్ని టూత్ పేస్ట్ లలో కెమికల్స్ ఉంటాయి. వీటిల్లో ఒక లాంటి తీపి పదార్థాన్ని వాడతారు. ఇది కాస్తా పళ్లను బలహీనం చేసి, దంత సమస్యలు వచ్చేలా చేస్తున్నాయి. అందుకే ఎంత బాగా శుభ్రం చేసుకున్నా కూడా చిగుళ్ల సమస్యలు, దంతక్షయం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి దూరం కావాలంటే హోమ్ మేడ్ టూత్ పేస్ట్ ని ఒక సారి వాడి చూడండి.

టూత్ పేస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కొబ్బరి నూనె, బేకింగ్ సోడా, మింట్ ఆయిల్

ఇవి కూడా చదవండి

తయరీ విధానం:

ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా వేయాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇది కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ నెక్ట్స్ ఫ్రెష్ నెస్ కోసం పుదినా (మింట్) ఆయిల్ ఓ పది చుక్కల వరకూ వేసి బాగా కలుపుకోవాలి. అంతే హోమ్ మేడ్ పేస్ట్ సిద్ధం. దీన్ని ఒకసారి వాడి చూడండి. మీకేమైనా ఇబ్బందులు కలిగితే మాత్రం వైద్యుల్ని సంప్రదించడం మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.