Liver Disease: మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తున్నాయా.. వెంటనే మేల్కోండి.. మీ లివర్ దెబ్బతింటున్నట్లే..

|

Sep 25, 2022 | 1:45 PM

చాలా మంది పైకి ఆరోగ్యంగానే కనబడతారు. కాని శరీరంలో ఏదైనా భాగం డామేజ్ అయితే మనకు వెంటనే తెలియకపోవచ్చు. దానికి సంబంధించిన లక్షణాలు కన్పించినా మనం వెంటనే మేల్కోకపోవడంతో ఆ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ముఖ్యంగా వ్యక్తి శరీరంలో లివర్ అనేది..

Liver Disease: మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తున్నాయా.. వెంటనే మేల్కోండి.. మీ లివర్ దెబ్బతింటున్నట్లే..
Liver Damage
Follow us on

Liver Disease: చాలా మంది పైకి ఆరోగ్యంగానే కనబడతారు. కాని శరీరంలో ఏదైనా భాగం డామేజ్ అయితే మనకు వెంటనే తెలియకపోవచ్చు. దానికి సంబంధించిన లక్షణాలు కన్పించినా మనం వెంటనే మేల్కోకపోవడంతో ఆ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ముఖ్యంగా వ్యక్తి శరీరంలో లివర్ అనేది చాలా కీలకమైన భాగం. కొంతమంది వ్యక్తులకు వారి అలవాట్లే ఆరోగ్యం పాడవడానికి కారణం అవుతుంది. సాధారణంగా కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు. కానీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం మన శరీరంలో లివర్ దెబ్బతింటున్నట్లే వెంటనే మేల్కోని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. పూర్తిగా లివర్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాలేయం అనేది మానవ శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం. ఇది అత్యంత సంక్లిష్టమైన అవయవాలలో ఒకటి. మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలను అందించడం, రక్తం నుంచి విష పదార్థాలను తొలగించడం, రక్తంలో చక్కెర, హార్మోన్ స్థాయిలను నియంత్రించడం వంటి అనేక విధులను కాలేయం నిర్వహిస్తుంది. లివర్ కు సంబంధించిన సమస్యలు త్వరగా బయటపడవు. అయితే లివర్ పాడవడం మొదలైతే శరీరంలో ఎటువంటి లక్షణాలు కనబడతాయో తెలుసుకుందాం.

వికారం లేదా వాంతులు: మానవ కాలేయం విష పదార్థాలను తొలగించగలదు. కానీ తరచుగా వికారం, వాంతులు అవుతుంటే.. అవి కాలేయ వ్యాధి హెచ్చరిక సంకేతాలుగా గుర్తించాలి.

ముదురు రంగులో మూత్రం: మూత్రం రంగు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తుంది. ముదురు రంగు మూత్రం నిర్జలీకరణాన్ని సూచిస్తుంది. శరీరంలో హానికరమైన పదార్థాల ఉనికిని కూడా సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

కామెర్లు: కాలేయ వ్యాధికి ప్రాథమిక సంకేతాలలో ఒకటి కామెర్లు. కామెర్లు అంటే కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారడం. కాలేయ కణాల నాశనం ఫలితంగా ఇది సంభవిస్తుంది.

స్కిన్ అలర్జి: అధిక స్థాయిలో చర్మంపై దురద వస్తే అది కాలేయ వ్యాధికి ప్రారంభ సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలా జరగకపోవచ్చు వెంటనే స్కిన్ అలర్జీ ఉంటే వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలి.

అలసట: ఏ పనిచేయకుండానే అలసటగా అనిపిస్తే ఆ లక్షణం కాలేయ వ్యాధికి అత్యంత సాధారణ, ప్రారంభ సంకేతాలలో ఒకటి. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అలసటగా ఉంటుంది. కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

వాంతులు చేసేటప్పుడు రక్తం: దీర్ఘకాలిక కాలేయ వ్యాధి లక్షణాలు ఎదుర్కొంటున్నప్పుడు వాంతుల్లో రక్తం కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని మీరు గుర్తిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొతం వైద్యం చేసుకోకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..