Lemon Peels: నిమ్మకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిమ్మకాయలు లేకుండా నిమ్మరసం, తాజా సలాడ్లను ఊహించలేం. నిమ్మకాయ మనం తినే ఆహారానికి రుచిని పెంపొందిస్తుంది. శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.
– నిజమే, మనం నిమ్మకాయలను అనేక రకాలుగా, అనేక రూపాల్లో ఉపయోగిస్తాము. అయితే, నిమ్మకాయ తొక్కను మాత్ర పడేస్తుంటాం. కానీ దాన్ని విసిరేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
– నిమ్మకాయ బహుముఖ ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉంది. రసం నుండి దాని తొక్క వరకు పోషకాలతో నిండి ఉంది.
– ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది.
– నిమ్మకాయ మన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరానికి పోషకాలను అందిస్తుంది. బేకరీలలో, శీతల పానీయాల తయారీలో ఉపయోగించబడుతుంది.
– నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిమ్మతొక్కలో విటమిన్స్, ఉప్పు, పీచు తదితరాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిని బట్టి నిమ్మకాయ గుజ్జులో కంటే.. తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి.
నిమ్మ పండు వల్ల కలిగే ప్రయోజనాలు..
– బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
– నిమ్మ తొక్కలో పెక్టిన్ ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
– నోటి సాధారణ సమస్యలకు చెక్ పెట్టొచ్యు.
– నిమ్మ తొక్కలలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ సి లోపాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది.
– యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. నోటి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది.
– గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. నిమ్మ తొక్కలో ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, పెక్టిన్ ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
– రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
– నిమ్మతొక్కలో క్యాన్సర్‌ను నిరోధించే శక్తి ఉంది. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అధ్యయనం ప్రకారం, బ్లాక్ టీలో నిమ్మ తొక్కను కలపడం వల్ల క్యాన్సర్ ముప్పు 70 శాతం తగ్గుతుంది. పై తొక్కలో సాల్వెస్ట్రాల్ Q40 లిమోనెన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కారక కణాలతో పోరాడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..