సాధారణంగా చిన్న పిల్లలు ఎక్కువగా అల్లరి పనులు చేస్తుంటారు. అలాగే వారు ఎక్కువా నోటిలో ముక్కులో.. చెవిలో వేళ్లు పెట్టుకుంటారు. పిల్లలకు ఉంటే ఈ అలవాట్లు తరచూ వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఎందుకంటే… పిల్లలు ఎక్కువగా నేలపై ఆడుకుంటుంటారు. అలాగే ప్రతి వస్తువును చేతులతో పట్టుకుంటారు. చేతులతో ఏమాత్రం శుభ్రం చేసుకోకుండా.. ప్రతిసారి నోటిలో పెట్టేస్తుంటారు. దీంతో అనారోగ్య సమస్యలు.. ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. పిల్లల నుంచి ఈ అలవాటు మాన్పించడం కోసం తల్లిదండ్రులు అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రతిసారి పిల్లల నుంచి ఈ అలవాటు దూరం చేయడంలో విఫలం అవుతారు. అలా పిల్లలను వారి నుంచి ఈ అలవాట్లు మాన్పించడం కోసం తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను పాటించాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.
పిల్లలు పదే పదే ముక్కులో.. నోటిలో వేలు పెట్టుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి ఈ అలవాటు ఎక్కువగా ఉండడం వలన ముక్కు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.
నోటిలో.. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు ఎప్పుడు ఆట వస్తువులను అందించాలి. వారికి నిరంతరం ఏదో ఒక పని చేప్పడం.. ఆటాడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన వారి మనసు.. చేతులు రెండు నిరంతం పని చేస్తూనే ఉంటాయి. దీంతో వారు క్రమంగా ఆ అలవాటును మర్చిపోతారు.
అలాగే.. వద్దని వారిస్తున్నా మీ పిల్లలు ప్రతిసారి వేళ్లు నోటిలో పెట్టుకుంటే.. రెండు వేళ్లను కలిపి టేప్ చేయండి. దీంతో క్రమంగా వారి అలవాటు మర్చిపోతారు. అయితే ఈ పద్దతిని కేవలం కొన్ని సందర్భా్ల్లో మాత్రమే పాటించాలి. ప్రతిసారి ఈ పద్దతిని ఫాలో అయితే ఇబ్బందులు పడతారు.
ఎక్కువగా ముక్కులో.. నోటిలో వేళ్లు పెట్టే అలవాటు ఉన్న పిల్లలకు నీళ్లు అధికంగా తీసుకునేలా చేయండి. వారు డీహైడ్రేట్ అయినప్పుడు ఎక్కువగా నోటిలో వేలు పెడతారు. అలాంటప్పుడు వారికి ఎక్కువగా నీళ్లు తాగేలా చేయాలి. అలాగే పిల్లల చేతికి ఎప్పుడు చిన్నపాటి టవల్ ఇవ్వాలి. ఎందుకంటే నిత్యం వారి చేతిలో ఒక వస్తువు ఉండడం వలన వారి చేతులు నోటిలో పెట్టుకోరు.
Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..
Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…
ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..