Bamboo Salt Benefits: ప్రపంచంలో అత్యంత కాస్టిలీ బొంగులో ఉప్పు.. ఆరోగ్య ప్రయోజలు ఎన్నో.. ఖరీదు తెలిస్తే షాక్..

|

May 15, 2023 | 12:28 PM

యుగాల నుండి కొరియన్ ఆహార సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం వెదురు ఉప్పు. అంతేకాదు కొరియన్ ఔషదాల్లో ఒకటిగా అనేక రకాల వ్యాధులకు చికిత్స కోసం ఈ ఉప్పుని ఉపయోగిస్తారు. అయితే ఈ ఉప్పు చాలా ఖరీదైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఉప్పు వేరియంట్‌ల నుండి భిన్నంగా ఉంటుంది.

Bamboo Salt Benefits: ప్రపంచంలో అత్యంత కాస్టిలీ బొంగులో ఉప్పు.. ఆరోగ్య ప్రయోజలు ఎన్నో.. ఖరీదు తెలిస్తే షాక్..
Bamboo Salt
Follow us on

ఆరు రుచుల్లో ఉప్పు వెరీ వెరీ స్పెషల్.. అయొడైజ్డ్ ఉప్పు, హిమాలయ ఉప్పు, కళ్ల ఉప్పు , ఇలా రకరకాల ఉప్పుల గురించి తెలుసు.. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు ఉందని.. దీనిని వెదురు నుంచి తయారు చేస్తారని మీకు తెలుసా.. ! వెదురు ఉప్పును పర్పుల్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ వెదురు ఉప్పు కొరియన్ సంస్కృతిలో ఒక భాగం. ఈ ఉప్పుమీద ఒట్టు వేసి అబద్దం చెప్పారని విశ్వాసం.. కనుక కొరియన్లు దానితో ప్రమాణం చేస్తారు. కేవలం 250 గ్రాముల ఉప్పు కొనాలంటే దాదాపు 100 డాలర్లు మన దేశంలోని కరెన్సీలో అయితే రూ. 7348 వెచ్చించాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు కి రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ రోజు ఈ వెదురు ఉప్పు గురించి .. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

అత్యంత ఖరీదు ఎందుకంటే 

యుగాల నుండి కొరియన్ ఆహార సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం వెదురు ఉప్పు. అంతేకాదు కొరియన్ ఔషదాల్లో ఒకటిగా అనేక రకాల వ్యాధులకు చికిత్స కోసం ఈ ఉప్పుని ఉపయోగిస్తారు. అయితే ఈ ఉప్పు చాలా ఖరీదైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఉప్పు వేరియంట్‌ల నుండి భిన్నంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలా తయారు చేస్తారంటే? 
వెదురు బొంగులను తీసుకుని లోపల సముద్రపు ఉప్పును నింపి.. వెదురును నిర్ణయించిన ఉష్ణోగ్రత వద్ద కాల్చి వెదురు ఉప్పును తయారు చేస్తారు. వెదురును కాల్చే ప్రక్రియలో వెదురులో ఉండే ఖనిజాలు ఉప్పు ఔషధాల గనిగా మారుస్తుంది. చాలాసార్లు కాల్చిన తర్వాత ఉప్పు రంగు మారుతుంది. ఉప్పు రాతి రంగులోని  ఉప్పుగా మారుతుంది. అనంతరం ఈ ఉప్పుని చూర్ణం చేసి ప్యాక్ చేస్తారు.

వాస్తవానికి, ప్రీమియం పర్పుల్ ఉప్పును అధిక ఉష్ణోగ్రత వద్ద 9 సార్లు వేడి చేసి తయారుచేస్తారు. ఈ ఉప్పు తయారీ ప్రక్రియ దాదాపు 40-45 రోజులు పడుతుంది.

వెదురు బొంగులను కాల్చే ప్రక్రియ 800 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. ఇలా  వెదురు బొంగులను కాల్చే సమయంలో ప్రత్యేక బట్టీలను ఏర్పాటు చేస్తారు.  అత్యంత నిపుణులు ఈ వెదురు ఉప్పుని తయారు చేస్తారు.

వెదురు ఉప్పు జీర్ణక్రియ, నోటి ఆరోగ్యం, చర్మ సంరక్షణను మెరుగుపరుస్తుంది. శోథ నిరోధక లక్షణాలు, క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుందని నమ్ముతారు.

అధ్యయనాల ప్రకారం  వెదురు ఉప్పులో సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే ఇనుము, పొటాషియం,  కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక శక్తి , జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ వెదురు ఉప్పులో బ్యాక్టీరియాను చంపే గుణాలు అధికంగా ఉన్నట్లు తేలింది. దీంతో నోటిలో దాగిన క్రిములు, బ్యాక్టీరియాను ఈ ఉప్పు చంపేసి.. నోటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ సాల్ట్ లో వేడిని తగ్గించే గుణాలు ఉన్నాయి. దీంతో ఈ ఉప్పు చాతీ మంట, కీళ్ల నొప్పులు ఉన్నవారికి అత్యంత సహాయకారి అని నమ్ముతారు. అత్యంత శ్రమతో తయారు చేసే ఈ వెదురు ఉప్పులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు అని నమ్మకం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Note:(ఇక్కడ ఇచ్చిన అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని అనుసరించాలన్న, సందేహాలున్నా ఆరోగ్య నిపుణుల సలహాలను సంప్రదించాల్సి ఉంటుంది)