చలికాలంలో ఈ పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.. అవెంటో తెలుసుకుందామా..

|

Oct 24, 2021 | 7:31 PM

చలికాలం ప్రారంభమైంది... వింటర్ సీజన్‏లో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలే కాకుండా.. అనారోగ్య సమస్యలు కూడా తీవ్రంగా వేధిస్తుంటాయి

చలికాలంలో ఈ పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.. అవెంటో తెలుసుకుందామా..
Winter
Follow us on

చలికాలం ప్రారంభమైంది… వింటర్ సీజన్‏లో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలే కాకుండా.. అనారోగ్య సమస్యలు కూడా తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ చలికాలంలో ఆరోగ్యంతోపాటు.. ఫిట్‏నెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‏లో కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ ఆహారంతో తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా ఉంచుకోవడమే కాకుండా.. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఫిట్ నెస్ కూడా సరిగ్గా ఉంటుంది. అంతేకాకుండా.. ఉబకాయాన్ని కూడా తగ్గిస్తాయి. అవెంటో తెలుసుకుందామా..

1. గసగసాలలో అనేక పోషకాలున్నాయి. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. అలాగే చలికాలంలో శరీరాన్ని ఎక్కువ సమయం వరకు వెచ్చగా ఉంచుతాయి. వీటిని పాయసం లేదా ఖీర్ లాగా తీసుకోవచ్చు.
2. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వాల్నట్స్ సహాయపడతాయి. ఇందులో ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.
3. నువ్వులు, బెల్లంతో చేసిన గజక్ శీతాకాలంలో సులభంగా లభిస్తుంది. ఇది చలిని తట్టుకునే పోషకాలను కలిగి ఉంటుంది. బెల్లంలో ఐరన్, ఫాస్పరస్, నువ్వులలో కాల్షియం, కొవ్వు ఉంటాయి. ఇది చలి నుండి శరీర ఉష్ణోగ్రతను కూడా సరిగ్గా ఉంచుతుంది.
4. చలికాలంలో కుంకుమ పువ్వు పాలు, పసుపు పాలు, ఖర్జుర పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి జలుబు, దగ్గును నివారిస్తాయి. అలాగే శరీరాన్ని ఎక్కువ సమయం వరకు వెచ్చగా ఉంచుతాయి.
5. పప్పు లడ్డు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

Also Read: Manchu Vishnu: హద్దులు మీరుతున్నారు… అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..

Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..

IND vs PAK, T20 World Cup 2021: పాకిస్తాన్ కోసం కొత్త బౌలర్‌.. బరిలోకి దించనున్న భారత్.. అతనెవరంటే?

Terrorism: ఉప్పెనంత విషాదం గుండెల్లో.. కొండంత ఆత్మవిశ్వాసం ఆ చిరునవ్వుల్లో.. ఈ ఫోటో వెనుక హృదయాలను కదిలించే కథ!