Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..

|

Mar 05, 2022 | 8:31 AM

వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పుడే సూర్యుడి తాకిడి ఎక్కువైంది. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు జరగడంతో శరీరంపై ప్రభావాలు జరుగుతున్నాయి.

Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..
Summer Diet
Follow us on

వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పుడే సూర్యుడి తాకిడి ఎక్కువైంది. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు జరగడంతో శరీరంపై ప్రభావాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మన జీవన శైలి.. తీసుకునే ఆహారం పై శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న సమయంలో వేడిగా… రాత్రిళ్లు చలిగానూ ఉంటుంది. వేసవి ప్రారంభంలో చిన్న చిన్న పోరపాట్లు చేయడం.. ఆహారం పై సరైన శ్రద్ధ పెట్టకపోవడం వలన అనారోగ్య సమస్యలు ఉంటాయి. అందుకే ఈ సీజన్‏లో తీసుకునే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

కీరదోసకాయ.. దోసకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో కీరదోసకాయ తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది. దోసకాయలో అధిక నీటిశాతం ఉండడం వలన డీహైడ్రేషన్ ను దూరం చేస్తుంది. అందుకే వేసవిలో దోసకాయలను వీలైనంత ఎక్కువగా తినాలి.

పెరుగు.. వేసవిలో పెరుగు తినడం వలన శరీరం చల్లబడుతుంది. మజ్జీగ.. లస్సీ రూపంలో తాగవచ్చు. రైతా చేసి ఆహారంలోకి తీసుకోవచ్చు. ఈ కాలంలో పండ్లతోపాటు.. పెరుగు.. స్మూతీని తయారు చేయడం ద్వారా తీసుకోవచ్చు.

కొబ్బరి నీరు.. నీరు వేసవిలో కొబ్బరి నీరు తీసుకోవడం అతి ముఖ్యం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు… ఇతర పోషకాలు ఉన్నాయి. ఇది కడుపును చల్లబరుస్తుంది. అధ్యాయనాల ప్రకారం రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వలన క్యాన్సర్ ను నివారిస్తుంది.

పుదీనా.. దీనిని పెరుగు, మజ్జిగ, రైతాతో కలిసి తీసుకోవచ్చు. పుదీనా చట్నీ తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా.. చల్లదనాన్ని ఇస్తుంది.

ఉల్లిపాయ.. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. నిమ్మకాయ, ఉప్పు కలిపి సలాడ్ గా తీసుకోవడం వలన శరీరానికి మేలు కలుగుతుంది. ఎర్ర ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది సహజ వ్యతిరేక అలెర్జీ కారకంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉల్లిపాయలు తినడం వలన వడదెబ్బ తగలదు.

నిమ్మరసం.. ప్రతి రోజు ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోవడం వలన శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. రుచిని పెంచడమే కాకుండా.. నిమ్మరసంలో ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడిని కూడా కలుపుకోవచ్చు. నిమ్మరసం రోజంతా చల్లగా ఉంచుతుంది.

పొట్లకాయ.. ఇందులో అనేక రకాల ప్రోటీన్స్, విటమిన్లు, మినరల్స్ సీసాలో ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఉన్నాయి. ఈ పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొట్లకాయ రసం తాగడం వలన డయాబెటిక్ రోగులుకు మేలు జరుగుతుంది.

పుచ్చకాయ.. ఇందులో 91.45 శాతం నీరు ఉంటుంది. ఇది శరీర అవసరాలను తీరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ విటమిన్ ఎ మూలం. ఇది కళ్లకు.. గుండెకు మంచిది. శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది.

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియోను చూశారా.? 1970 కాలాన్ని పున సృష్టించిన తీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Pushpa: పుష్ప ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. బ్యాక్‌ టు బ్యాక్‌ డైలాగ్స్‌ అన్నీ ఒకే చోట..

Prabhas: ప్రభాస్‌ అంత సింపుల్‌గా ఉంటారని ఊహించలేదు.. డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్‌ హీరోయిన్‌..