ప్రతి రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తీసుకోవడం అనేక ప్రయోజనాలున్నాయి. ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని (Hot Water) తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా.. బరువు తగ్గుతారు. అలాగే ప్రతిరోజూ బెల్లం (Jaggery) తినడం వలన అనేక లాభాలున్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన శరీరంలో అనేక ప్రయోజనాలున్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకొని తాగడం వలన బరువు తగ్గుతారు. అలాగే కడపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇంకా మరెన్నో ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందమా.
బెల్లంలో విటమిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఎనర్జీ, చక్కెర, కార్బోహైడ్రేట్, సోడియం మొదలైన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలన్ని శరీరానికి మేలు చేస్తాయి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తలోపాన్ని తగ్గిస్తుంది.
గోరువెచ్చని నీటితో బెల్లం తీసుకోవడం వలన ప్రయోజనాలు..
– ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవడం వలన జీవక్రియ పెరుగుతుంది. దీంతో బెల్లం కలిపి తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. ఎసిడిటీ సమస్యతో ఇబ్బందిపడేవారు వేడి నీటిలో బెల్లం కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య తగ్గడమే కాకుండా.. బరువు తగ్గుతారు.
– గోరువెచ్చని నీరు, బెల్లం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గొప్ప ఔషదం. ఈ నీటిని తాగిన వెంటనే జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే కిడ్నీ సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
– గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో టాక్సిన్ సులభంగా తగ్గుతుంది. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది.
– వేడి నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరాన్ని ఉత్సాహపరుస్తుంది.
బెల్లం నీళ్లు తయారు చేసుకోవడం..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోని అందులో బెల్లం ముక్క వేసి బాగా కలపాలి. ఈ హెల్తీ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని రోజూ తాగాలి. ఇలా చేస్తుంటే కొన్ని నెలల్లో బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది..శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బెల్లం నీళ్లలో కలిపి తాగకూడదనుకుంటే తిన్న తర్వాత నీళ్లు తాగొచ్చు. ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల పొట్ట కూడా క్లియర్ అవుతుంది. ఇది కాకుండా బెల్లం రోటీ, బెల్లం చిక్కి, బెల్లం ఖీర్, పాయసం, బెల్లం టీ వంటి ఆరోగ్యకరమైన వాటిని కూడా తినవచ్చు.
బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
– బెల్లంలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
– బెల్లం తినడం వల్ల కాలేయం నుండి విష పదార్థాలను సులభంగా బయటకు పంపవచ్చు, ఎందుకంటే ఇందులో యాంటీటాక్సిక్ ప్రభావాన్ని కలిగి ఉండే సూక్ష్మపోషకాలు ఉంటాయి.
– మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, బెల్లం తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి. దీని లోపం రక్తహీనతకు దారితీస్తుంది, ఇది అలసట, బలహీనతకు దారితీస్తుంది. – శరీరంలో ఇనుము లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది.
– మీ రక్తపోటు ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే బెల్లం తినాలి. ఇందులో ఐరన్ ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది.
గమనిక :- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్.. నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దయచేసి వీటిని అమలు చేసే ముందు వైద్యులను సంప్రదించాలి.
Also Read: Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..
Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..
Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..