గుడ్డులో (Eggs) ప్రోటిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే సాధారణంగానే గుడ్లు మన శరీరంలో వేడిని పెంచుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో గుడ్లు తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు వేసవిలో ఎన్ని గుడ్లు తినాలి.. అసలు తినకూడదా ? అనే విషయాలపై డాక్టర్ నేహా సన్వాల్కా వివరణ ఇచ్చారు. గుడ్లు శరీరంలో వేడిని పెంచుతాయని.. కానీ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. ఇందులో కాల్షియం, ఐరన్, పాస్పరస్ వంటి అనేక రకాల విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వేసవిలో గుడ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందని.. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటుంటారు. అయితే ఇది అపోహా మాత్రమే అంటున్నారు వైద్యులు నేహా. గుడ్లు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను అందించడమే కాకుండా.. వేసవిలో వేడిని తగ్గిస్తాయన్నారు. వేసవిలో అలసట, బలహీనతను తగ్గిస్తాయన్నారు.
సాధారణంగా వేసవిలో రోజుకు 1 నుంచి 2 గుడ్లు తినాలి. అంతకు మించి తీసుకోవద్దు. ఇతర కాలాల్లో 4కు పైగా గుడ్లు తినవచ్చు. కానీ వేసవిలో రెండింటి కంటే ఎక్కువగా తినకూడదు. వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే కడుపు సంబంధిత సమస్యలను తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు. అలాగే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. వేసవిలో గుడ్లు ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా కాకుండా.. మితంగా తినాలని అంటున్నారు డాక్టర్ నేహ.
గమనిక:- గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని అమలు చేయడానికి ముందుగా వైద్యులను సంప్రదించాలి.
Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం
NTR: యంగ్ టైగర్ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..
Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్
Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్