చాయ్.. ఎంత ఒత్తిడిలో ఉన్నా..పనిభారం ఉన్నా.. మనసుకు కాస్త్ రిలాక్సియేషన్ కలిగిస్తుంది. అందుకే చాయ్ ప్రియులు మన దేశంలో చాలా మందే ఉన్నారు. ఉదయం లేవగానే టీ తాగకుండా అస్సలు ఉండలేరు.. ఇక మరికొందరు మాత్రం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు లెక్కలేనన్ని సార్లు టీ తాగేస్తుంటారు. పని భారం.. మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే… టీ కంటే మెరుగైన ఔషదం మరొకటి లేదనే చెప్పాలి. అయితే టీ తాగడం వలన ఆరోగ్యానికి బోలేడన్ని ప్రయోజనాలున్నాయి. అలాగే ఎక్కువగా తాగిన అనర్థాలను కూడా కలిగిస్తుంది. రోజులో టీని రెండు కప్పులకంటే ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..
12 ఏళ్లలోపు పిల్లలు టీ అస్సలు తాగకూడదు. ఇందులో ఉండే కెఫిన్ వారి శరీరానికి హాని కల్గిస్తుంది. అలాగే శరీరంలోని పోషకాలను నాశనం చేస్తుంది. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ, టీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒక కప్పు టీలో కప్పు కాఫీలో ఉండే కెఫీన్ కంటే మూడో వంతు తక్కువగా ఉంటుంది. అయితే టీని ఎక్కువగా తీసుకోవడం వలన అలసట, గుండె వేగం పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు కల్గిస్తుంది. అలాగే ఎక్కువగ చేస్తోన్న పనులు మర్చిపోతారు. టీలో ప్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఇది ఎక్కువ మొత్తంలో వెళితే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. తొందరగా ఎముకలు అరిగిపోతాయి. అలాగే రోజులో ఐదు కప్పుల కంటే ఎక్కువగా టీ తాగితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అమ్మాయిలు టీ ఎక్కువగా తాగితే పొత్తి కడుపులో నొప్పి కలుగుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా కడుపులో యాసిడిటి పెరుగుతుంది. గర్భిణీలు టీ తాగకూడదు.
అలాగే టీ ఎక్కువగా తాగితే ఐరన్ లోపం కలుగుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు మాంసాహారం లేని ఆహార పదార్థాల నుంచి శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటాయి. రక్తంలో కెఫీన్ కలిస్తే పొగ, సిగరేట్, ఆల్కహాల్, టీ, కాఫీ ఎక్కువగా తీసుకునే వారిలో అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇక రక్తపోటు ఉన్నవారికి తలతిరగడం ఎక్కువగా ఉంటుంది.
Also Read: భయంకరమైన రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ, రన్నరప్ స్పాట్ డెడ్.. హృదయవిదారక దృశ్యాలు..