Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..

|

Mar 20, 2022 | 7:55 AM

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోన్న సమస్య మోకాళ్లు, కీళ్ల నొప్పులు (Knee Pain). అలాగే.. వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక సమస్యలు

Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..
Knee Pain
Follow us on

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోన్న సమస్య మోకాళ్లు, కీళ్ల నొప్పులు (Knee Pain). అలాగే.. వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక సమస్యలు వేధిస్తుంటాయి. మధుమేహం.. అలసట.. బలహీనత వంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న మోకాళ్లు.. కీళ్ల సమస్యలు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి.. అనేక విధాల చికిత్సలు తీసుకుంటారు. కానీ ఈ సమస్యలు మాత్రం తగ్గావు.. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో ఆలివ్ చెట్టు ఆకుల రసం మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి తెలీంది. స్విస్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యాయనంలో ఆలివ్ లేదా ఆలివ్ ట్రీ లీఫ్ ఎక్స్‏ట్రాక్ట్ పెయిన్ కిల్లర్‏గా పనిచేస్తుందని వెల్లడైంది. ఈ చెట్టు ఆకులలో అనేక సమ్మేళనాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. వీటిని పాలీఫెనాల్స్ అని కూడా అంటారు. ఇవి శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి. అలాగే.. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ే

కరోనరీ ధమనుల లోపల కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో ద్వారా ఆలివ్ ఆయిల్ గుండెను కాపాడుతుందని అధ్యాయనాలు చెబుతున్నాయి. రొమ్ము క్యాన్సర్.. అల్సరేటివ్ కొలిటివ్.. డిప్రెషన్‏ను కూడా తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇటీవల ఓ వెబ్‏సైట్స్‏లో ప్రచురించిన ఈ పరిశోధనలో 55 అంతకంటే ఎక్కువ వయస్సు గల 124 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనకు స్విస్ ఎముకల శాస్త్రవేత్త మేరీ నోల్లే హోర్కాజాడా నాయకత్వం వహించారు.. 124 మందిలో పురుషులు.. మహిళలు ఇద్దరూ సమాన సంఖ్యలో ఉన్నారు. వారిలో సగానికి పైగా అధిక బరువు ఉన్నవారు కూడా ఉన్నారు. వారిలో 62 మందికి రోజుకు రెండుసార్లు 125 మి. గ్రా ఆలివ్ ఆకుల రసం మాత్రం రూపంలో ఇచ్చారు.. మరికొందరికి ప్లేసిబో ఇచ్చారు…

6 నెలల తర్వాత వారి మోకాలి నొప్పులు.. ఆస్టియో ఆర్థరైటిస్ ఫలితాల స్కోర్ ఆధారంగా టెస్ట్ చేశారు.. ఇందులో వారి మోకాళ్ల నొప్పులు తగ్గినట్టుగా తేలీంది. అలాగ ప్లేసిబో తీసుకున్నవారిలో మార్పులు తక్కువగా కనిపించారు.. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం డైటరీ సప్లిమెంట్స్ మోకాలి నొప్పిని తగ్గించగలవు. పురాతన గ్రీస్ నుండి సహజ నివారణలలో ఆలివ్ ఆకులను ఉపయోగిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆలివ్ ఆకులను ఉపయోగించారు. అయితే ఈ ఆకుల రసాన్ని తీసుకోవడానికి ముందు వైద్యులను సంప్రదించాలని సూచించారు…

గమనిక : – ఈ కథనం కేవలం పరిశోధనలు.. నిపుణుల అభిప్రాయాలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.

Also Read: Puneeth Rajkumar: అందుకే నేను పునీత్‌ చివరి సినిమాకు వెళ్లలేదు.. జేమ్స్‌ చిత్రంపై అప్పు సతీమణి అశ్విని ఎమోషనల్‌..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్‌.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?