ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ఉబకాయం. వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య యువతలో ఎక్కువగా ఉంది. అధిక బరువు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మారిన జీవనశైలి.. పని ఒత్తిడి.. ఆహారపు అలవాట్ల కారణంగా.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇక పొట్ట తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ.. చివరకు చికిత్సల వరకు వెళ్తున్నారు. కానీ మనం రోజు తీసుకునే కూరగాయలతోనూ బరువు తగ్గో్చ్చు అనే సంగతి గమనించారా ? సాధారణంగా మనం తీసుకునే కూరగాయలతో అనేక ప్రయోజనాలున్నాయి.
ముఖ్యంగా పచ్చి కూరగాయలను తీసుకోవడం వలన పొట్ట తగ్గే అవకాశాలున్నాయి. అలాగే కడుపులో ఎదురయ్యే సమస్యలు కూడా సులభంగా తగ్గిపోతాయి. గోరు చిక్కుడు తినడం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలున్నాయి. ఇవి బరువు తగ్గించడమే కాకుండా.. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. గోరు చిక్కుడును ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే ఫలితాల గురించి తెలుసుకుందామా.
గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా.. సలాడ్గానూ తీసుకోవచ్చు. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణాశయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పొట్ట శుభ్రమవుతుంది. అలాగే ఇందులో కాల్షియం ఉన్న కారణంగా ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే భాస్వరం, కాల్షియం కూడా ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.
Maha Samudram: ఓటీటీలోకి మహా సముద్రం.. ? శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు ఆఫర్ అంటే..
Shekar Kammula: ఇందూరు యాసకు శేఖర్ కమ్ముల ఫిదా.. నిజామాబాద్ గడీలు, కోటల గురించి ఆసక్తికర కామెంట్స్..